English | Telugu
సీబీఐ న్యాయవాదికి జ్వరమొచ్చింది! జగన్ పై ప్రధానికి రఘురామ లేఖ..
Updated : Jul 26, 2021
ఎంపీ రఘురామ కృష్ణం రాజు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏ1, ఏ2లపై చర్యలు తీసుకోవాలని అందులో ఆయన కోరారు. జగన్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తనపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశారని, ఇప్పుడు తాను కూడా వారిద్దరిపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాశానని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. జగన్, విజయసాయిల అక్రమ ఆర్థిక వ్యవహారాలు, సూట్ కేసు కంపెనీలపై ఆ లేఖలో వివరించినట్టు తెలిపారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. సీబీఐ కేసు వాయిదా పడటంపైనా రఘురామ స్పందించారు. జగన్ బెయిల్ రద్దు కేసు పలు కారణాలతో మళ్ళీ వాయిదా పడిందన్నారు. ఒకేసారి సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు జ్వరం రావడంపై...తనకు అనుమానాలు లేవన్నారు. అయినా ఒకేసారి జ్వరం ఎలా వచ్చిందని రఘురామ ప్రశ్నించారు.
ట్విటర్‌లో విజయసాయిరెడ్డి అవాస్తవాలు ప్రచారం చేశారని రఘురామ ఆరోపించారు. ఆయన పేర్కొన్న అంశాలను లేఖలో ప్రధానికి వివరించానన్నారు. ఏ-2 పెట్టిన సూట్‌కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరుపుతున్నారని ఆరోపించారు. క్విడ్‌ప్రోకో, సూట్‌కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. తాను విదేశాలకు వెళ్లకుండా పాస్ట్‌పోర్టు రద్దు చేయాలని అడుగుతున్నారని, మరి 20కి పైగా కేసులున్న విజయసాయిరెడ్డి పాస్‌పోర్టును ఏం చేయాలని రఘురామ ప్రశ్నించారు. ఏపీ అంశాలపై అందరం కలిసి రాజీనామా చేద్దామని, అందుకు సిద్ధమా? అని రఘురామ సవాల్ చేశారు.