English | Telugu

కరోనా పోరులో యువత పాత్రే కీలకం

ప్రజల ప్రవర్తనపై స్టడీ

ప్రపంచ మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తున్న కరోనా యువతలోనూ ప్రాణాపాయం కలిగిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు మధ్యవయస్కుల్లో, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిలో, వృద్ధుల్లో కరోనా ముప్పు ఎక్కువగా ఉందని అనుకున్నాం. కానీ, డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికల మేరకు యువత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

చాలా దేశాల్లో యువత తమకేం కాదన్న ధీమాతో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. యువతలోనూ ఎక్కువగా ఉంటుంది. కరోనా పోరాటంలో యువతే కీలక పాత్ర తీసుకుంటూ తమను తాము రక్షించుకుంటూ వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోం ఘెబ్రియేసస్ అన్నారు.

ప్రపంచంలోని 40 శాతం మరణాలు ఇతర జబ్బులతో బాధపడుతున్నవారిలోనే సంభవించాయన్నారు. అందులో 80 శాతం మరణాలు అభివృద్ధి చెందిన దేశాల్లోనే సంభవించాయన్నారు.

కరోనాను అరికట్టేందుకు చాలా దేశాలు ఎన్నో మార్గాలో ప్రయత్నాలు చేస్తున్నాయని అయితే ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్యమన్నారు. కరోనా కట్టడిలో ప్రజల ప్రవర్తనలో, అవగాహనలో వచ్చిన మార్పును స్టేడీ చేసేందుకు బిహేవియరల్ ఇన్ సెట్స్ అండ్ సైన్స్ ఆఫ్ హెల్తీ ఓ టెక్నికల్ అడ్వ‌జైర్ గ్రూప్ను ఏర్పాటు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో చీఫ్ వెల్ల‌డించారు. ఈ గ్రూఫ్ లో సైకాలజీ, న్యూరోసైన్స్, ఆంత్రపాలజీ, హెల్త్ ప్రమోషన్ తదితర సెక్టార్ల‌లో నిపుణులు ఉంటారు. 16 దేశాలకు చెందిన 22 మంది ఎక్స్ పర్ట్స్ ను ఎంపిక చేశారు.