English | Telugu
నవరాత్రులలో సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న రోజా...
Updated : Oct 5, 2019
నవరాత్రుల సందర్భంగా వైసీపీ ఎంఎల్ఏ రోజా కనక దుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి దయతో వర్షాలు బాగా పడి రాష్ట్రం లోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయని ఏపీపీఏసీ చైర్ పర్సన్ రోజా అన్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మ వారిని దర్శించుకొని భక్తులందరూ అన్ని శుభాలు పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుండాలని అమ్మ వారిని కోరుకోవాలని ఆమె వెల్లడించారు. నవరాత్రుల పూజా విధానం గురించి వివరించే పుస్తకాన్ని భక్తులకు బహుమతిగా ఇస్తున్నామని రోజా చెప్పారు. అమ్మ వారిని నేను కోరుకునేది ఒక్కటేనని జగనన్నకి ఏ ఆటంకాలు లేకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి, మళ్ళీ రాజన్న పరిపాలనే అందరికీ కూడా అందించే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని రోజా తెలిపారు. ఆయనకు శక్తినీ, ఆరోగ్యాన్నీ, బలాన్నీ, ఆలోచన శక్తి నివ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని రోజా తెలియజేశారు. ముఖ్యంగా ఈ రోజు మూలా నక్షత్రం కావున దర్శనానికి రావాలంటే ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అని అసలు దర్శనం చేసుకోగలమా అని భయపడుతూనే వచ్చాము అని ఆవిడ పేర్కొన్నారు. ఎందుకంటే గతంలో చాలా అనుభవాలలో ఎదురు చూశామని, కానీ ఈ సారి మన మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దగ్గరుండి చాలా చక్కటి ఏర్పాట్లు చేయటం జరిగిందని వైసిపి ఎంఎల్ఏ రోజా తెలియజేశారు. ఎక్కడా కూడా ఎదురు చూడాల్సిన అవసరం చేయకుండా ఎంతో సాఫీగా వీఐపీ లైన్ లో దర్శనం చేసుకున్నట్టే , జనరల్ లైన్స్ కూడా మహిళలు, పిల్లలు అందరూ కూడా చాలా సంతోషంగా వెళ్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.