English | Telugu
మద్యం దుకాణాలు తెరవం! వ్యసనపరులకు PHC సెంటర్లలో చికిత్స!
Updated : Mar 30, 2020
మద్యం వ్యసనంగా వున్న వ్యక్తుల కుటుంబాలకు ఆ వ్యక్తులపై ఎక్కువ దృష్టి పెట్టి మనసు మరల్చడానికి యోగ వంటి ఆసనాలు, ద్యానం, వ్యాయామం, ఆద్యాత్మిక చింతన, కుటుంబ సభ్యులతో ఇతరత్రా ఆటలు చెస్, క్యారమ్స్ వంటి ఆటలను ఆడటం వలన మంచి మానసిక శక్తి నిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం వారితో గడపాలని సూచించారు.
ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేతపై కృతనిశ్చయంతో వున్నందున సంబందిత అధికారులు తగు చర్యలు తీసుకొని, మద్యం దుకాణాల బంద్ ను అమలుచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కరోన నిర్మూలించడానికి ఇచ్చిన ఆదేశాలను సమార్దవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్లు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కరోన కారణంగా లాక్ డౌన్ సమయంలో అన్ని మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యానికి వ్యసనంగా మారిన కొందరు వ్యక్తులు మానసికంగా ఆందోళనకు గురైతు వింతగా ప్రవర్తించడం వంటి విషయాలపై చర్చించారు.