English | Telugu
బీజేపీ దేశాన్ని అమ్మేస్తోంది! 50 ప్రశ్నలు సంధించిన కేటీఆర్
Updated : Nov 24, 2020
బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు కేటీఆర్. లోయర్ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది బీజేపీ కాదా?అని ప్రశ్నించారు. పేకాట క్లబ్‌లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్ వేయాలి అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీపై రైతులు ఛార్జిషీట్ వేయాలన్నారు. పెట్టు బడుల ఉపసంహరణ దేశ భవిష్యత్ కోసమా.. గుజరాత్ పెద్దల కోసమా? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్ల లో హైదరాబాద్‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా? అని బీజేపీ నేతలను నిలదీశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే టీఆర్‌ఎస్‌పై చార్జ్‌షీట్ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను ప్రశ్నించారు కేటీఆర్.