English | Telugu
ఆ బెంజ్ కారు నాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
Updated : Sep 18, 2020
అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై మంత్రి జయరాం స్పందించారు. అయ్యన్న మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బెంజ్ కారు తనదే అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆ కారు ఎవరి పేరు మీద ఉందో చూసుకోవచ్చన్నారు. తన కుమారుడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని.. అలా తన కొడుకు చేతుల మీదుగా ఎవరైనా ఫ్యాన్స్ కారు కీస్ తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏదో ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కలిశారు. కారు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగారు. అయ్యన్న ఒకటే ఫోటో చూపించారు..ఇంకా నాలుగైదు ఉన్నాయని మంత్రి చెప్పుకొచ్చారు.