English | Telugu
విశాఖలోని రసాయన పరిశ్రమలో అర్థరాత్రి పేలుళ్లు.. భారీ అగ్ని ప్రమాదం..
Updated : Jul 14, 2020
వరుసగా అనేక పేలుళ్లు సంభవించడంతో లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా ఘటన జరిగిన ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు వేడి తీవ్రంగా ఉండడంతో ఫైర్ సిబ్బంది సైతం లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోయారు.
చుట్టూ పక్కల జిల్లాల లో ఉన్న ఫార్మా పరిశ్రమల నుండి హెచ్ సి ఎల్, ఇథనాల్ వంటి రసాయనాలు సేకరించి వాటిని శుద్ధి చేసి హైదరాబాద్ చెన్నై లోని పరిశ్రమలకు సప్లై చేస్తుంది. నిన్న రాత్రి సాల్వెంట్ ఫార్మా కంపెనీలో నైట్ షిప్ట్ మొదలైన కొద్దిసేపటికే ఈ పేలుడు జరిగింది. ఐతే ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు సిబ్బంది విధుల్లో ఉన్నట్టుగా అధికారులు చెప్పారు. ఐతే ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది గాయపడగా వెంటనే వారిని గాజువాకలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.