English | Telugu

ప్రజలను గాలికి వదిలేయలేం.. మీకు చేతనైంది చేసుకోండి...

ఏపీలోని క్రిష్ణా జిల్లా నూజివీడు లో కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. కొత్తగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవడమే కాకుండా మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో పట్టణం లో మళ్ళీ లాక్ డౌన్ పెట్టాలని విజ్ఞప్తులు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం నూజివీడులోని పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఒక వారం, పది రోజుల పటు లాక్ డౌన్ ప్రకటిస్తే సహకరిస్తామని నూజివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కూడా ముందుకు వచ్చారు. ఐతే సమస్యల్లా అధికార పార్టీ నేతలతోనే అని సమాచారం. కరోనా కేసులు తక్కువగా ఉన్నపుడు నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణి పేరుతొ అటు ప్రజలలోను ఇటు అధికారులతో కలిసి పని చేసిన నేతలు ఇపుడు పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇపుడు అధికార యంత్రాంగం ఒకటి రెండు రోజుల్లో లాక్ డౌన్ ప్రకటించే ఆలోచన చేస్తుండగా అధికార పార్టీ నాయకులు కొందరు అడ్డుపడుతున్నట్లుగా కూడా సమాచారం. ఐతే లాక్ డౌన్ విషయం పై ఈ రోజు అన్ని శాఖల అధికారులు కలిసి కరోనా నియంత్రణ కోసం ఒకనిర్ణయం తీసుకోబోతున్నామని ఆ పార్టీ నాయకులకు తెలిపినట్లు సమాచారం. దీని గురించి మీ లోకల్ నాయకత్వానికి చెప్పుకోవాలని ఒక వేళ అధికారులు తీసుకునే నిర్ణయం కనుక నచ్చకపోతే 24 గంటల్లో తమను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని కూడా వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా కొద్ది రోజులు లాక్ డౌన్ పెట్టి కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేసి నూజివీడు ప్రజలను ఈ మహమ్మారి నుండి బయట పడేయాలని అధికార యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.