English | Telugu
మద్యం షాపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి లీడర్ కొల్లు రవీంద్ర...
Updated : Oct 4, 2019
మీడియాతో మాట్లాడిన టిడిపి లీడర్ కొల్లు రవీంద్ర వైసిపి పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట తప్పను, మడమ తిప్పను అని మాటలు చెప్పే జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాయ మాటలు చెబుతూ పేపర్ లో మూడు వేల ఐదు వందల షాపులు పరిమితం చేశారని ప్రకటన ఇచ్చారని అన్నారు. నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులుంటే ఆ షాపులకి ప్రతి సంవత్సరం రెన్యువల్ అయి, రన్నింగ్ లో ఉండేవి కేవలం మూడు వేల ఆరు వందలు మాత్రమే అని కానీ, మూడు వేల ఆరు వందలని మళ్లీ యథావిధిగా కొనసాగించి ఇవాళ ఇరవై శాతం షాపులను తగ్గిచ్చేశామని వైసిపి వాళ్ళు చెప్తున్నారని అన్నారు. మూడు వేల ఆరు వందలకి ఇరవై శాతం అంటే ఏడు వందల ఇరవై తగ్గిస్తే కేవలం రెండు వేల ఎనిమిది వందల షాపులే ఉండాలి కదా అని ప్రశ్నించారు. ప్రజల్ని తప్పు దారి పట్టిస్తూ, షాపుల్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వాధికారులతోనే ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయించి విక్రయాలను చేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులుని మద్యం దుకాణాల్లో సేల్స్ మెన్స్ కింద ఏర్పాటు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇదే కాకుండా ప్రభుత్వం చేత నడిపించబడుతున్న మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్ లకు మాత్రమే పరిమితం చేసి డిస్టలరీస్ నుంచి పెద్ద ఎత్తున జె టాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారని అన్నారు. దాదాపు రెండు వేల కోట్లకు పైన ఈ జె టాక్స్ పేరుతో జగన్ ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. సామాన్యుడు తాగే దానికేమో పది రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకి ట్యాక్స్ పెంచి, డబ్బున్నవాళ్ళు తాగే ఫారెన్ లిక్కర్ కేమో నామినల్ గా రేట్లు పెంచడం చాలా దురదృష్టకరమని అన్నారు.