English | Telugu

జైలులో ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు

కోటి 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అరెస్టయిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చంచల్‌గూడ జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నెల రోజులుగా ఏసీబీ ఈ కేసు పై ఎంక్వైరీ చేస్తోంది. ఇటీవలే ఆయన ఇళ్లల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో నగదు, స్థిరాస్తి పత్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

దాదాపు 19 ఎకరాల భూమికి సంబంధించిన వివాదాన్ని క్లియర్ చేయడానికి నాగరాజు లంచం డిమాండ్ చేస్తున్నారని అప్పట్లో ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో నెల రోజులుగా ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇక తాను ఈ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాదని భావించడం వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకొని ఉంటారని తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.