సీఎం కేసిఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు చరణ్ రెడ్డితో జరగనున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లికూతురును చేసారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభ స్వయంగా హాజరై వధువుకు డైమండ్ నక్లెస్, పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, మహిళాభివృద్ధి శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితరులు హాజరయ్యారు. ఈ రోజు జరిగే ప్రత్యూష, చరణ్ రెడ్డి వివాహానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది.