English | Telugu
కంటి వెలుగు అవుతానంటోన్న జగన్... రేపే అనంత నుంచి శ్రీకారం
Updated : Oct 9, 2019
సంక్షేమమే ప్రధాన అజెండాగా విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... మరో వెల్ఫేర్ స్కీమ్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. పేదల ఆరోగ్యమే లక్ష్యంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ పథకాన్ని... అనంతపురం నుంచి జగన్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేయనున్నారు. ఆరు విడతలుగా మూడేళ్లపాటు ఈ పథకం అమలు కానుంది.