English | Telugu

వైసీపీలో తారాస్థాయికి విభేదాలు.. ఎంపీపై మంత్రి పీఏ ఫిర్యాదు

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో విభేదాలుతారాస్థాయికి చేరుకుంటున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు పీఏ సురేష్ పోడూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.మంత్రి రంగనాథరాజుపై ఎంపీ రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేశారనిపేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి పీఏ సురేష్కోరారు. అయితే, మంత్రి రంగనాథరాజు పీఏ సురేష్ ఫిర్యాదును పోలీసులుస్వీకరించలేదు. ప్రైవేటు కేసు కాబట్టి కోర్టులోనే తేల్చుకోవాలని పోలీసుల సూచించారు.