English | Telugu

కేవలం 12 గంటల్లోనే భారత్ లో 240 కరోనా కేసులు


మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ మరింత పెరుగుతోంది. గత 12 గంటల్లోనే దేశంలో 240 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేసింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,637కు చేరిందని తెలిపింది. ప్రస్తుతం 1,466 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 133 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇక తెలంగాణలో ఇప్పటివరకు 92 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 87 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఒక్కరోజులోనే కొత్తగా 43 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా కరోనా బారిన పడ్డ ఈ 43 మంది ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో పాల్గొని వచ్చిన వారేనని తెలుస్తోంది.