English | Telugu
దేశ సరిహద్దుల్లో సైన్యం సిద్ధంగా ఉంది
Updated : Sep 4, 2020
డ్రాగన్ కంట్రీ చర్యలను తిప్పికొడతాం
భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్
భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తూ సరిహద్దుల వెంట తన సైన్యబలగాలను మోహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ భారత్ సైన్యం ముందుకు వెళ్తోంది. సరిహద్దుల్లో ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. డ్రాగన్ కంట్రీకి ధీటైన జవాబు చెప్పేందుకు ఆర్మీ సర్వసన్నద్దంగా ఉందని, ఇప్పటికే త్రిదళాలను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు చాపకింద నీరులా సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనా సైన్యం ఆటలు ఇక సాగవని, కుట్రలను తిప్పికొట్టగల శక్తి సామర్ధాలు భారత్ కు ఉన్నాయని ఆయన అన్నారు.
మరో వైపు భారత్ చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. యుద్ధం అంటూ వస్తే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు భారత్ చేస్తోంది. అమెరికా, జపాన్ , ఫ్రాన్స్ ఇప్పటికే మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. అమెరికా సైనిక దళాలు కూడా ముందస్తుగానే భారత్ కు అండగా నిలుస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దు వివాదంలో అమెరికా సైన్యం భారత దేశానికి మద్దతు ఇస్తామని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ఇప్పటికే వెల్లడించారు. యుద్ధ నౌకలను కూడా దక్షిణ హిందు మహాసముద్రంలో మోహరించారు. తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి రష్యాలో పర్యటిస్తూ ఆ దేశ మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.