English | Telugu
కన్న కూతురు శవం కోసం ఆరాటపడుతున్న తల్లిదండ్రులు...
Updated : Oct 9, 2019
కన్న కూతురు ఎక్కడైనా క్షేమంగానే ఉందిలే అనుకున్న తల్లిదండ్రులకు కూతురు శవంగా మారిందని తెలిసి కుప్పకూలిపోయారు. వివరాళ్లోకి వేళ్తే అమెరికా సంబంధం అంటే గతంలో తల్లితండ్రులు ఎగిరి గంతేసేవారు. కూతురు విదేశాలకూ వెళ్తుంది. సంతోషం గా ఉంటుందని అక్కడి సంబంధాల వైపే మొగ్గు చూపేవారు. అయితే రానురాను ఫారిన్ పెళ్లిళ్లు విషాదాంతం అవుతున్నాయి. తాజాగా అమెరికా లోని నార్త్ కరోలినా లో వనిత అనే వివాహిత భర్త అత్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పదిహేనేళ్ల క్రితం శివ కుమార్ తో వనితకు పెళ్లయ్యింది నాలుగేళ్ళ కాపురం ఆనందంగా సాగింది. వీరిద్దరికీ సింధూ, సిద్ధార్థ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాపురంలో కలహాలు మొదలయ్యాయి. పెద్ద మనుషుల సమక్షం లో పంచాయితీ కూడా చేశారు కుటుంబ సభ్యులు. అయినా తరచూ గొడవలు జరుగుతూ వచ్చేవి ఈనేపధ్యం లో ని పుట్టింటి కి తిరిగొచ్చింది వనిత. వనిత తల్లితండ్రులు హైదరాబాద్ నాగోల్ ఉంటున్నారు. భర్తతో విబేధాలు అత్తింటి వేధింపు లు తట్టుకోలేక చాలా కాలం నుంచి ఇక్కడే ఉంటోంది. అయితే పిల్ల లను చూసేందు కు గత జూలైలో భర్త దగ్గర కు వెళ్లింది వనిత. కానీ రెండు నెలల నుంచి కాంటాక్ట్ లో లేదు ఏమి జరిగిందా అని శివ కుమార్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు తల్లితండ్రులు. అయినా ఫలితం లేకుండా పోయింది. సడన్ గా ఫోన్ చేసి మీ కూతురు సూసైడ్ చేసుకుంది అమెరికాలోనే అంత్యక్రియులు చేసేస్తున్నామని చెప్తాడు అల్లుడు. కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. అత్తింటి వేధింపు లతోనే తమ కుమార్తె చనిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. డెడ్ బాడీని ఇండియా కు తీసుకు రావాలని కోరుతున్నారు. అల్లుడు శివ కుమార్ పై ఎల్ బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురి విషయంలో వారికి తీరని లోటు జరిగిందని అది ఎప్పటికి తిరిగి రాలేనిదని కనీసం తన బాడీని అయినా వారికి అప్పగించాలి అని ఆ తల్లిదండ్రులు వాపోతున్నారు.వారి కూతురు ఎన్నో కష్టాలు అనుభవంచిందని కనీసం తమ తల్లిదండ్రులతో కూడా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిని ఎదురుకుందని,ఎప్పుడు కనీసం తమతో గడిపే అవకాశానికి కూడా తాము నోచుకోలేదని వారు తమ బాధను వ్యక్తం చేస్తూ వారికి న్యాయం చేయ్యాలని ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.