English | Telugu
ఏపీ సర్కార్ పై హైకోర్ట్ ఫైర్.. ఆ ఫోటోలేంటి?.. పార్లమెంట్ పై పీఎం ఫోటో ఉందా?
Updated : Feb 5, 2020
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. పంచాయితీ కార్యాలయాలకు అధికార పార్టీ వైసీపీ రంగులు వేయడంపై నేడు ఏపీ హైకోర్టు లో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పంచాయితీ కార్యాలయాలపై వేసిన రంగులు, పార్టీ జెండాలు రంగులు వేర్వేరు అని ప్రభుత్వ తరపు న్యాయవాది అనగానే.. రంగులను తాము పోల్చుకోగలమని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. పంచాయితీ కార్యాలయాలపై సీఎం ఫోటోను ఎందుకు ముద్రించారని న్యాయమూర్తి ప్రశ్నించారు. రాష్ట్ర సీఎంగా రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టే సీఎం ఫోటో ముద్రించారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. న్యాయవాది వ్యాఖ్యలపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ పై ప్రధాని ఫోటో సుప్రీం కోర్ట్ పై ప్రధాన న్యాయమూర్తి ఫోటో ఉందా? అని నిలదీశారు. ఇలాంటి సాంప్రదాయం ఎక్కడ ఉందో చూపించాలని ప్రశ్నించారు. పార్టీ జెండా, గుర్తులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.