English | Telugu

పాఠశాలలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం (ఆగస్టు 13) నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులకు తీసుకోవలసిన చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వోద్యోగుల సెలవులను రద్దు చేశారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

కుండపోత వర్షాల సూచనతో ముందు జాగ్రత్తగా స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించారు. హనుమకొండ, వరంగల్, జనగామ, యదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు 13, 14 తేదీల్లో సెలవులు ప్రకటించింది విద్యాశాఖ. ఇక హైదరాబాద్ నగరంలో రేవు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని పేర్కొంది.