English | Telugu
బెంగాల్ వదిలేసి గుజరాత్ వెళ్లిపోండి! బీజేపీ చీఫ్‌కు టీఎంసీ కౌంటర్
Updated : Nov 17, 2020
దిలీఫ్ ఘోష్ కామెంట్లకు బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం కౌంటరిచ్చారు. అలా అయితే ఘోష్ వెంటనే రాష్ట్రాన్ని వదిలేసి గుజరాత్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో అదానీ, అంబానీ లాంటి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఫలితంగా చిరు వ్యాపారులు చితికిపోయారని హకీం ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలివెళ్లిన నానో కంపెనీని కూడా మూసివేశారని మంత్రి విమర్శించారు. గుజరాత్ అల్లర్లలో దాదాపు 2 వేల మంది చనిపోయారని చెప్పిన హకీం.. ఇష్రాత్ జహాన్ వంటి ఎందరో ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌లా మారుస్తామని అంటున్నారని, అదే జరిగితే ఇక్కడి ప్రజలు నిత్యం ఎన్‌కౌంటర్ల భయంతో బతకాల్సి వస్తుందని చెప్పారు ఫిర్హాద్ హకీం.