English | Telugu
కరోనాతో ఏపీ మాజీ మంత్రి మృతి
Updated : Aug 1, 2020
పశ్చిగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.
మాణిక్యాలరావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విచారం వ్యక్తం చేశారు.