English | Telugu

నర్సుపై డాక్టర్ అత్యాచారయత్నం.. పోలీసుల కళ్లుగప్పి పరార్!

ఆంధ్రప్రదేశ్ లో దిశ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత లైంగిక వేధింపులపై అవగాహన ఏర్పడుతుంది. తప్పు చేస్తే చట్టాలు శిక్షస్తాయనే భయం ప్రతి ఒక్కరిలో నాటుకొనేలా చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశంకూడా. ఆ దిశగా తప్పు చేసిన వారిని ఎక్కడికక్కడ అవగాహన ఏర్పరిచి.. ఆ చట్టం.. శిక్షలపై ప్రభుత్వం ప్రజలకు.. అవగాహనతో కూడిన ప్రచారం నిర్వహిస్తుంది. తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రి డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పరారైన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.

ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో డీడీవోగా విధులు నిర్వహిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. ఓ నర్సును రాత్రి వేళ పిలిచి అత్యాచారయత్నం చేయడంతో రవీంద్రనాథ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే విషయంపై నర్సు బంధువులు.. వచ్చి రవీంద్రనాథ్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రవీంద్రనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదే సమయంలో రవీంద్రనాథ్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడంతో సర్వత్రా కలకలం రేపుతోంది. రవీంద్రనాథ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.