English | Telugu
దీపావళి నాటికి అదుపులోకి కరోనా.. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ చల్లని కబురు
Updated : Aug 31, 2020
అనంత్‌కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నేషన్ ఫస్ట్’ వెబినార్ లో మంత్రి మాట్లాడుతూ రాబోయే దీపావళి నాటికి వైరస్ వ్యాప్తిని కొంతవరకూ అదుపులోకి తీసుకురాగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ కూడా రెడీ అవుతుందన్నారు. డాక్టర్ దేవీ ప్రసాద్ శెట్టి, డాక్టర్ సీ ఎన్ మంజునాథ్ తదితర నిపుణులు తెలిపిన విధంగా కొంతకాలం తరువాత కరోనా కూడా మిగిలిన వైరస్‌ల మాదిరిగానే ఒక సాధరణ సమస్యగా మిగిలిపోతుందని అయన అన్నారు.