English | Telugu
ప్లాస్మా దానం చేయండి! తబ్లిగి జమాత్ చీఫ్ పిలుపు!
Updated : Apr 22, 2020
కరోనా నుంచి కోలుకున్నతబ్లిగి జమాత్ సభ్యులు తమవంతు సాయంగా ప్రస్తుతం వైరస్ బారినపడి పోరాడుతున్న వారికి.. రక్తంలోని ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దనే ఉండి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు చేయాలని ఆయన కోరారు.
ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లిగి జమాత్‌కు హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో విచారణకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మౌలానా సాద్ ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు.