English | Telugu
హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్న కరోనా వైరస్.... నేడు రానున్న అనుమానితుల ఫలితాలు
Updated : Jan 28, 2020
రోజుకొక కొత్త భయంకర రోగాలతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు. మందులు లేని రోగాలతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి సైతం తమ ప్రాణాలను వదిలేస్తున్నారు. మొన్నటి దాకా హడలెత్తించిన 'స్వైన్ ఫ్లూ' కే బయపడుతున్న ప్రజలకు 'కరోనా వైరస్' అనే కొత్త జబ్బు ప్రజలను ముప్పుతిప్పలు పెడుతొంది.హైదరాబాద్ లోనూ కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. చైనా నుండి వచ్చిన నలుగురు అనుమానితులు ఫీవర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరిలో ముగ్గురు చైనా, హాంకాంగ్ నుండి వచ్చిన వ్యక్తులు కాగా వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఈ నలుగురినీ ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించటంతో అతడి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పూణెకు పంపించారు.ఈ ఫలితాలు ఇవాళ వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మిగిలిన ముగ్గురిలో ముక్కు కారడం తప్ప మరే ఇతర లక్షణాలూ లేవు. కానీ ముందొస్తు చర్యలుగా వారిని కూడా ప్రత్యేక వార్డులో అబ్జర్వేషన్ లో ఉంచారు వైద్య బృందం.
చైనా నుండి వచ్చిన ప్రయాణికుల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికి ప్రత్యేక విభాగంలో చికిత్స అందజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పరీక్షల్లో కరోనా వైరస్ లేదని నిర్దారించేంత వరకూ కుటుంబ సభ్యుడు సన్నిహితంగా ఉండేవారని ఇళ్లకే పరిమితం చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వైరస్ లక్షణాల కల్పించటానికి సుమారు రెండు వారాలు పట్టే అవకాశముందని ఆలోగా వ్యాధి లేదని బయట తిరిగితే ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా వైరస్ కు మందు లేదని లక్షణాలను బట్టి వైద్యం అందించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ వెల్లడించారు. తెలంగాణ మెడికల్ డిపార్ట్ మెంట్ ఫీవర్ ఆస్పత్రిలో 10, గాంధీలో 40, చెస్ట్ ఆస్పత్రిలో 50 పడకలతో ఇన్సులేషన్ వార్డులు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతి ఒక్కరు తమ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు.