English | Telugu

బెంబేలెత్తిస్తున్న కరోనా.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్.. 

భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో 90,802 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,04,614కు చేరుకుంది. నిన్న మరో 1016 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 71,642కు చేరుకుంది. అయితే దేశంలో ఇప్పటివరకు 32,50,429 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,82,542కి చేరింది.

ఇది ఇలా ఉండగా ప్రపంచంలోనే ఒక దేశంలో ఒకే రోజు 90వేల పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. అంతేకాకుండా కొత్త కేసుల నమోదులో భారత్ 32 రోజులుగా టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇక మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది.