English | Telugu

మరో ఆందోళనకర అంశం.. విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానం

భారత్ లో కరోనా విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. రోజుకి దాదాపు పదివేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే, కరోనా కేసుల్లో మహారాష్ట్ర చైనా దేశాన్ని దాటేసింది. ముంబై వూహాన్‌ నగరాన్ని దాటేసింది. కొద్దిరోజుల్లో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలలో భారత్ మూడో స్థానానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి చాలదు అన్నట్టు, తాజాగా మరో ఆందోళనకర అంశం బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకి ఆరోగ్యం విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు వరల్డో మీటర్‌ ప్రకటించింది. కరోనా బారినపడినవారిలో అత్యధికంగా అమెరికాలో 16,907 మంది క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా.. భారత్‌లో వారి సంఖ్య 8,944 అని పేర్కొంది. బ్రెజిల్‌లో మన కంటే మూడు రెట్లు కేసులు అధికంగా ఉన్నప్పటికీ అక్కడ విషమ స్థితిలో ఉన్నవారు 8,318 మాత్రమే. రష్యా(2,300)లో సీరియస్‌ కేసుల సంఖ్య భారత్‌లో నాలుగో వంతు కావడం గమనా ర్హం. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగుల సంఖ్యలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ఆందోళన కలిగిస్తోంది.