English | Telugu

ఏపీలో 40 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కు దాటింది. గత 24 గంటలలో మరో 2,602 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 643 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 40,646 కి చేరింది. గత 24 గంటలలో 42 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 534కి చేరింది. ఇప్పటివరకు 20,298 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 19,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి.