English | Telugu

ఏపీలో 6 లక్షల కరోనా పరీక్షలు

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే కరోనా పరీక్షల్లో ఏపీ ముందుంది. తాజాగా, కరోనా పరీక్షల్లో ఏపీ మరో మైలురాయిని దాటింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 13,923 శాంపిల్స్ పరీక్షించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 6,12,397కు చేరింది. ప్రతి పది లక్షల మందికి సగటున 11,468 పరీక్షలు నిర్వహించడం ద్వారా ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.

ఏపీలో మరణాల రేటు కూడా తగ్గింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.33 శాతంగా ఉంటే, ఏపీలో మాత్రం 1.23 శాతంగా ఉంది. గురువారం, కృష్ణా జిల్లాలో కరోనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 92కి చేరింది. కొత్తగా 425 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. మొత్తం‌ కేసుల సంఖ్య 7,496కు చేరింది. ఇందులో 5,854 కేసులు ఏపీవి కాగా.. 1,353 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, 289 కేసులు విదేశాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,632గా ఉంది.