English | Telugu
ప్రగతి భవన్ ను తాకిన కరోనా.. తెలంగాణాలో కరోనా విలయం
Updated : Jul 2, 2020
ఇది ఇలా ఉండగా నిన్న సీఎం కార్యకలాపాలు సాగించే సీఎం క్యాంప్ ఆఫీసు, ప్రగతి భవన్ లో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడి గెలిచిన 9,069 మంది డిశ్చార్జి అయ్యారు. 275 మంది ఈ వైరస్ బారిన పడి మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 9,226 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇక టెస్టుల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 5,356 శాంపిల్స్‌ను పరీక్షించగా 4,143 మందికి నెగెటివ్ రాగా 1,213 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇప్పటి వరకు 98,153 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.