English | Telugu
చంద్రబాబు కోసం బండ్ల గణేష్ పాదయాత్ర
Updated : Jan 19, 2026
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్రు పేరిట తాను చేపట్టిన ఈ యాత్ర ఎంత మాత్రం రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేసిన బండ్ల గణేష్ కేవలం తన మొక్కు చెల్లించుకోవడం కోసం మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నానన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సోమవారం (జనవరి 19) ఉదయం ఆయనీ యాత్రను ప్రారంభించారు. దాదాపు 500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమ లకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేయడం తనను ఎంతో బాధించిందన్న బండ్ల గణేష్ అప్పట్లో ఆయనకు బెయిలు వస్తుందని కోర్టు విచారణ ఉన్న ప్రతిసారీ సుప్రీంకోర్టులో ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఈ కేసు నుంచి ఆయన ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నానన్నారు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికే షాద్ నగర్ లోని తన సినిమా థియేటర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించానని బండ్ల గణేష్ చెప్పారు.