English | Telugu
ఏక్ దో తీన్ డాన్స్ కంపోజర్ సరోజ్ ఖాన్ కన్నుమూత
Updated : Jul 3, 2020
సరోజ్ ఖాన్ దాదాపు రెండు దశాబ్దాలుగా 2 వేలకు పైగా సినిమాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. ‘తేజాబ్’ సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన ‘ఏక్ దో తీన్’ పాట ఆమె కు సూపర్ హిట్ ను ఇచ్చింది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ హీరోగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘దేవదాస్’ సినిమాలో ‘డోలా రే డోలారే ’ పాట, తమిళ సినిమా శృంగారం చిత్రం లోని, "జబ్ వి మెట్" లోని ‘యే ఇష్క్ హై’ పాటలు ఆమెకు మంచి పేరు తీసుకు రావడమే కాక జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు. సరోజ్ ఖాన్ చివరి సారిగా 2019లో కరణ్ జోహార్ నిర్మించిన "కళంక్" సినిమాలో మాధురీ దీక్షిత్ నటించిన "తబా హోగయీ" పాటకు కొరియోగ్రఫీ చేశారు. సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబ సభ్యులకు తమ సంతాపం తెలియచేస్తున్నారు.