English | Telugu
నీకు సబ్జెక్ట్ తెలియదు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా?
Updated : Dec 3, 2020
అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదని విమర్శించారు. అసెంబ్లీని వైసీపీ నేతలు తప్పుదారి పట్టించారని ధ్వజమెత్తారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీకి రాకూడదని అంటున్నారు.. అసెంబ్లీ ఏమన్నా మీ తాత జాగీరా? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ ఒక జీరో సీఎం.. అవగాహన లేని ముఖ్యమంత్రి అని విమర్శించారు. దిశ చట్టం తెస్తున్నామని, అసెంబ్లీలో ప్రకటించిన నాడే జగన్ కు హితవు పలికానని అన్నారు. కొంచెం ఓపిక పట్టు, నీకు పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు అని నచ్చచెప్పేందుకు యత్నించానని తెలిపారు. సబ్జెక్టు గురించి ఏం తెలుసు నీకు? కనీసం బిజినెస్ రూల్స్ అంటే తెలుసా? హెచ్ఓడీ రూల్స్ తెలుసా? సచివాలయ రూల్స్ తెలుసా? ఏమీ తెలియవు నీకు అని విమర్శించారు. చట్టం తెచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ చేయాలి. ఇవేమీ చెయ్యకుండా చట్టాన్ని ఢిల్లీకి పంపించి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ప్రారంభించారు. బుద్ధి ఉన్నవాడెవడూ ఇలా చేయడు. మేం కట్టిన పోలీస్ స్టేషన్లకు రంగులేసుకుని రిబ్బన్ కట్ చేశారు. ఇలాంటి వాళ్లతో రాష్ట్రం పరువేం కావాలి! అతను అమాయకుడో, మనం అమాయకులమో అర్థం కావడంలేదు అని విరుచుకుపడ్డారు.