English | Telugu
రైతు దగా దినోత్సవం.. ఒక్కో రైతుకు రూ. 80 వేలు నష్టం
Updated : Jul 8, 2020
వైసీపీ సర్కారు అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొత్తది కాదని, అన్నదాత సుఖీభవను రద్దు చేసి రైతు భరోసా పథకం తీసుకువచ్చారని అన్నారు. రైతు భరోసా పేరుతో 5 ఏళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది రూ37,500 మాత్రమే అని, అదే టీడీపీ ప్రభుత్వం వచ్చి వుంటే ఒక్కో రైతుకు రూ. లక్షా 20 వేలు వచ్చేవని తెలిపారు. ఒక్కో రైతుకు 5 ఏళ్లలో రూ. 80 వేలు నష్టం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రం ఇచ్చేది కాకుండా.. బడ్జెట్ లో చెప్పిన సంఖ్యలోనే 10 లక్షల మంది రైతులకు భరోసా ఎగ్గొట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.