English | Telugu

ఆ గ్రూపులకి చెక్ పెట్టాలి.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

ఆ గ్రూపులకి చెక్ పెట్టాలి.. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు!

Publish Date:Aug 7, 2025

  ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కార్మిక సంఘాలు వర్సెస్ నిర్మాతలు అన్నట్టుగా పరిస్థితి ఉంది. సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనేది లేదని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. అయితే నిర్మాతలు మాత్రం అంత మొత్తం పెంచడానికి సిద్ధంగా లేరు. ఈ విషయంపై కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. బయట వర్కర్స్ తో షూటింగ్ చేయడానికి కొందరు సిద్ధపడటం, దీంతో యూనియన్లు గొడవ చేయడం వంటివి జరిగాయి. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్.. లోకల్ టాలెంట్‌ను తక్కువగా చేస్తూ విమర్శలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన విశ్వప్రసాద్.. తన విమర్శలు వ్యవస్థపై మాత్రమేనని, ప్రతిభపై కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రెస్ నోట్ ను విడుదల చేశారు.   "హైదరాబాద్‌లో అపారమైన ప్రతిభ ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సుమారు 60% నుండి 70% వరకు పని చేసే బృందం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. గతంలో 10% ఉన్న స్కిల్‌ గ్యాప్‌ ఇప్పుడు 40% దాకా పెరగడం కేవలం ప్రతిభ ఒక్కటే లేకపోవడం కాదు. అసలు కారణం కొత్త టెక్నీషియన్లు, ఆర్టిస్టులు పరిశ్రమలోకి రానివ్వకుండా రూ.5-7 లక్షల వరకు అక్రమంగా డిమాండ్‌ చేసే గ్రూపుల వల్ల. నిజమైన టాలెంట్‌, స్కిల్‌ ఉన్న వాళ్లకు ఇది ప్రధానమైన అడ్డంకిగా నిలుస్తుంది. ఇప్పటికే మేజార్టీ టీం హైదరాబాద్‌ నుంచే వస్తోంది. మిగిలిన గ్యాప్‌ కూడా ఇక్కడి ప్రతిభతోనే నింపాలి. నేను హైదరాబాద్‌ టాలెంట్‌ను తక్కువగా అంచనా వేస్తున్నానన్న అభిప్రాయం పూర్తిగా తప్పు. నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు. హైదరాబాద్‌లో టెక్నీషియన్లు, ఆర్టిస్టులు తెలుగు సినిమాకు ఎప్పట్నుంచో అండగా ఉన్నారు. వాళ్లను అడ్డుకునే వ్యవస్థల్ని తొలగించాలి.. మెరిట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.. స్థానిక ప్రతిభకు అవకాశాలు కల్పించాలి... వడ్డీల కోసమే ఉండే గ్రూపులను అడ్డుకోవడం మన బాధ్యత. ఇదే మన పరిశ్రమ భవిష్యత్తుకు అవసరం." అని విశ్వప్రసాద్ తెలిపారు.    
Mayasabha Web Series Review

Mayasabha Web Series Review

Publish Date:Aug 7, 2025

Cast: Aadhi Pinisetty, Chaitanya Rao Madadi, Sai Kumar, Divya Dutta, Tanya Ravichandran, Ravindra Vijay, Shatru Crew: Created by Deva Katta Music Director : Shakthikanth Karthick Cinematographers  : Suresh Ragutu, Gnana Shekar V. S. Editor : Praveen K. L. Directors : Deva Katta, Kiran Jay Kumar Producers : Vijay Krishna, Lingamaneni, Sree Harsha Streaming on OTT Platform: Sony LIV Release Date: 7th August 2025  No: of Episodes: 09 Mayasabha is the new web series from creative writer and director Deva Katta, who dares to touch political subjects in Telugu Cinema. The series is based on fictionalised lives of Nara Chandra Babu Naidu and YS Rajasekhar Reddy. It deals with their rise and explores fictionalised NTR's entry into AP politics as well. So, with such controversial history of AP Politics, let's see what Deva Katta is serving us in this series.  Plot:  Kakarla Krishnama Naidu (Aadhi Pinisetty) and MS Rami Reddy (Chaitanya Rao) hail from same area of Andhra Pradesh and they start their political journey almost simultaneously. They become friends as they join same political party and grow together as influential young leaders. KKN becomes son-in-law of RCR (Sai Kumar), famous actor and slowly, RCR's decisions about politics start affecting both of their lives. What happens to their lives due to this political change in the state? Watch the series, to know more.  Analysis:  Aadhi Pinisetty delivered his best upon the instructions of the director. You see him being balanced in his portrayal and not mocking the real leader to maintain the character. It feels welcoming to watch such a matured portrayal. Chaitanya Rao also doesn't fall into the traps of confiding to mockery and he does a good job in bringing a complex character to life. Sai Kumar impresses us yet again with his maturity to imitate and not completely fall into buffoonery or mockery in his portrayal. All others look good and delivery their best. More than the performances it is writing this series based on such popular leaders that aks for great maturity. Deva Katta tries to balance his prowess as a writer to his directorial ambition and ability. He wants to be very clear in his approach to maintain the sincerity of his core idea while also exploring the reasons behind the real-life actions in his fictional world.  His act of balancing needed more maturity and impressive tactical flair. He did showcase his tendency to over tell certain things and over drive certain points home with too much information. There is a certain level of fear in not touching the wrong side of any leader, too. Still, it is engaging to watch and the drama is gripping enough to ask our attention.  Certain episodes do feel like they have been dragged too much while some does do a good job in humanising these idols. Production values, music and performances are the major positives of this series. But certain elements in writing do feel a little bit too convenient and confusing at places. Overall, we can say that the series is a watchable drama with such a controversial content without taking sides.    Bottomline: An Engaging Political drama with ebbs and flaws.    Rating: 3/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. 

తను సినిమా నటినని కోర్టులో ప్రూవ్‌ చేసుకున్న వాణిశ్రీ.. ఎందుకో తెలుసా? 

Publish Date:Aug 2, 2025

(ఆగస్ట్‌ 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రిది ఒక శకం అని చెప్పొచ్చు. సావిత్రిలాంటి నటి మరొకరు లేరు, రారు అనుకుంటున్న సమయంలో ఓ వెలుగులా చిత్ర పరిశ్రమలోకి దూసుకొచ్చారు వాణిశ్రీ. సావిత్రి పోలికలతోనే వాణిశ్రీ ఉందని అందరూ అనుకున్నారు. సావిత్రి మాదిరిగానే మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కథానాయికగా ఎదిగారు. పొగరు గల ధనవంతురాలిగా, ఆత్మాభిమానం కలిగిన మధ్య తరగతి యువతిగా, అమాయకురాలిగా, అణకువ కలిగిన భార్యగా, చిలిపి పనులు చేస్తూ నవ్వించే అమ్మాయిగా.. ఇలా ఏ పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో మెప్పించగల ప్రతిభాశాలి వాణిశ్రీ.  1948 ఆగస్ట్‌ 3న నెల్లూరులో రాఘవయ్య, వెంకమ్మ దంపతులకు రెండో కుమార్తెగా జన్మించారు వాణిశ్రీ. ఆమె అసలు పేరు రత్నకుమారి. చిన్నతనంలోనే టి.బి.తో తండ్రి చనిపోయారు. ఒక్క నెలలోనే వారి కుటుంబంలోని ముగ్గురు అదే వ్యాధితో మరణించారు. వెంకమ్మ తన ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగించారు. వాణిశ్రీ చదువుకుంటూనే నాట్యం నేర్చుకున్నారు. స్కూల్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌లో వాణిశ్రీ డాన్స్‌ చూసిన కన్నడ డైరెక్టర్‌ హునుసూరు కృష్ణమూర్తి.. తను చేస్తున్న వీరసంకల్ప చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలోని నటనకు, చేసిన డాన్సులకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో నాటకాల్లో నటించారు వాణిశ్రీ. ముఖ్యంగా చిల్లకొట్టు చిట్టెమ్మ, రక్తకన్నీరు, రాగరాగిణి, దొంగ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. వీరసంకల్ప రషెస్‌ చూసిన బి.విఠలాచార్య నవగ్రహ పూజా మహిమ చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు.  ఎ.వి.ఎం సంస్థ నిర్మించిన నానుమ్‌ ఒరుపెణ్‌ చిత్రాన్ని తన సొంత బేనర్‌ శ్రీవాణి ఫిలింస్‌ పతాకంపై నాదీ ఆడజన్మే పేరుతో నిర్మించాలనుకున్నారు ఎస్‌.వి.రంగారావు. అందులోని ప్రధాన పాత్ర కోసం వాణిశ్రీని ఎంపిక చేశారు. ఆ సమయంలోనే తమ బేనర్‌ పేరు కూడా కలిసి వచ్చేలా రత్నకుమారి పేరును వాణిశ్రీగా మార్చారు ఎస్వీఆర్‌. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర జమునకు దక్కింది. బాలీవుడ్‌ నటి వైజయంతిమాలను వాణిశ్రీ ఆదర్శంగా తీసుకున్నారు. నటనలోని మెళకువలు, డైలాగులు ఎలా చెప్పాలి వంటి విషయాలు ఎస్వీఆర్‌ నేర్పించారు. 1967లో వచ్చిన మరపురాని కథ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పటివరకు జానపద చిత్రాలు రాజ్యమేలాయి. వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి జానపదాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు వాణిశ్రీ.  ఇలా ఉండగా, 1969లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆత్మీయులు చిత్రంలో తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించారు వాణిశ్రీ. ఈ సినిమాలో మొదట అక్కినేనికి చెల్లెలుగా నటించమని అడిగారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. కానీ, తను హీరోయిన్‌గా అయితేనే చేస్తానని పట్టుబట్టి దాన్ని సాధించుకున్నారు. అక్కినేనికి చెల్లెలుగా విజయనిర్మల నటించారు. ఆ తర్వాత అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌లోనే వచ్చిన భలే రంగడు కూడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్‌తో నటించిన తొలి సినిమా నిండు హృదయాలు. హాస్యనటుడు పద్మనాభం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కథానాయిక మొల్ల చిత్రంలో మొల్ల పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు వాణిశ్రీ. ఈ సినిమాకి నంది అవార్డు లభించింది.  సాధారణంగా హీరోలకు లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ, వాణిశ్రీకి మహిళా అభిమానులు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమె చీరకట్టుకునే విధానం, హెయిర్‌ స్టైల్‌, జ్యూయలరీ.. మహిళలను విపరీతంగా ఆకర్షించేవి. ఈ విషయాల్లో వాణిశ్రీ ఎన్నో ప్రయోగాలు చేశారు. తన గెటప్‌ విషయంలో ఆమెకు పూర్తి అవగాహన ఉండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమె ఏది చేస్తే అదే బెస్ట్‌ అనేవారు. ఒక శిల్పంలా అందంగా కనిపించేందుకు వాణిశ్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. సరైన డైట్‌ పాటిస్తూ స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఆరోజుల్లో నవలా పఠనం ఎక్కువగా ఉండేది. ఆయా నవలల్లో కథానాయిక ఎలా ఉందని వర్ణిస్తారో దానికి నిజమైన రూపంగా వాణిశ్రీ కనిపించేవారు. అందుకే లెక్కకు మించిన నవలా చిత్రాల్లో వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వాణిశ్రీ తర్వాత నవలా నాయిక అని పేరు తెచ్చుకున్న నటి మరొకరు లేరు.  1970 దశకం వచ్చేసరికి వాణిశ్రీ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌,  శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్‌, కాంతారావు, రంగనాథ్‌, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. అలా వచ్చిన దసరాబుల్లోడు, కొడుకు కోడలు, ప్రేమనగర్‌, బంగారుబాబు, దేశోద్ధారకులు, ఎదురులేని మనిషి, ఎదురీత, కన్నవారి కలలు, గంగ-మంగ, చక్రవాకం, జీవనజ్యోతి, ఇల్లు ఇల్లాలు, రైతుబిడ్డ, చీకటి వెలుగులు, చక్రధారి, భక్తకన్నప్ప, జీవనతరంగాలు, కృష్ణవేణి, వంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించాయి. తమిళంలో శివాజీ గణేశన్‌ వంటి అగ్రశ్రేణి నటులతో 80 సినిమాల్లో వాణిశ్రీ నటించారు. అలాగే కన్నడలో రాజకుమార్‌ వంటి హీరోల సరసన 30 సినిమాల్లో నటించారు. అయితే మలయాళంలో మాత్రం కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 1981లో వచ్చిన దేవుడు మావయ్య హీరోయిన్‌గా ఆమె చివరి సినిమా. ఆమె కెరీర్‌లో మేకప్‌ లేకుండా నటించిన సినిమాలు రెండు. బాపు దర్శకత్వంలో వచ్చిన గోరంతదీపం, శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వంలో రూపొందిన అనుగ్రహం. హీరోయిన్‌గా కొన్ని వందల సినిమాల్లో నటించినప్పటికీ తను చేసిన సినిమాల్లో కృష్ణవేణి, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే తనకు నచ్చిన సినిమాలని చెబుతారు వాణిశ్రీ.  హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడే జరిగిన ఓ సంఘటన వాణిశ్రీ సినిమాలు విరమించడానికి కారణమైంది. అప్పటివరకు ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌.. కమర్షియల్‌ హీరోగా నటించిన సినిమా ఎదురులేని మనిషి. ఈ సినిమాను కె.బాపయ్య డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాలోని కసిగా ఉంది.. కసికసిగా ఉంది.., కృష్ణా ముకుందా మురారి.. అనే పాటల చిత్రీకరణ వాణిశ్రీని ఎంతో బాధపెట్టాయి. అప్పటివరకు ఏ సినిమాలోనూ అలాంటి పాటలు వాణిశ్రీ చేయలేదు. ఇలాంటి డాన్సులు చేయడం వల్ల ప్రేక్షకుల్లో తనపై ఉన్న గౌరవం పోతుందని భావించిన వాణిశ్రీ.. ఆ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే చాలా సినిమాలు కమిట్‌ అయి ఉండడం వల్ల అవి పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలా దేవుడు మావయ్య చిత్రంతో హీరోయిన్‌గానే రిటైర్‌ అయ్యారు వాణిశ్రీ.  సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న మరుసటి సంవత్సరం 1978లో చెంగల్పట్టుకు చెందిన డాక్టర్‌ కరుణాకరన్‌ను వివాహం చేసుకున్నారు వాణిశ్రీ. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వాణిశ్రీ సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ తన అక్క భర్త చూసుకునేవారు. అలా చాలా ఆస్తులు ఆమె బావ పేరు మీదే ఉన్నాయి. పెళ్ళి తర్వాత తన ఆస్తులు తిరిగి ఇవ్వాలని వాణిశ్రీ కోరారు. దానికి ఆమె అక్క, బావ ఇద్దరూ ఒప్పుకోకవడంతో వాణిశ్రీ భర్త కోర్టుకెక్కారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ కేసు కోర్టులోనే ఉంది. ఒక దశలో తన పేరు వాణిశ్రీ అనీ, ఆ ఆస్తులన్నీ సినిమాల్లో నటించడం ద్వారానే సంపాదించానని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల్లో నటించడం ద్వారా నిర్మాతలు డబ్బు ఇచ్చినట్టు అగ్రిమెంట్లు ఉంటే కేసు గెలుస్తామని వాణిశ్రీ తరఫు న్యాయవాది చెప్పడంతో ఆ ప్రూఫ్‌ కోసం సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. అలా నటించిన మొదటి సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడమే కాకుండా వాణిశ్రీ పోషించిన అత్త క్యారెక్టర్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో మళ్లీ అవకాశాలు వెల్లువెత్తాయి. అలా బొబ్బిలిరాజా, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, పెద్దింటల్లుడు, స్వాతిచినుకులు, రాజేశ్వరీ కళ్యాణం వంటి వైవిధ్యమైన సినిమాల్లో వాణిశ్రీ నటించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ 60 సినిమాలు చేయడం విశేషం.  సినిమాలు వద్దనుకొని 1981లోనే రిటైర్‌ అయిన వాణిశ్రీ.. తాను సినిమాల్లో నటించడం ద్వారా ఆస్తులు సంపాదించానని నిరూపించుకోవడం కోసమే తన సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించారు. మొదటి ఇన్నింగ్స్‌లో, సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ తన స్థాయికి తగిన సినిమాలే చేశారు తప్ప విమర్శలకు తావిచ్చే క్యారెక్టర్స్‌ వాణిశ్రీ ఎప్పుడూ చేయలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయడం ద్వారా కోర్టు కోరిన అగ్రిమెంట్లు సమర్పించి కేసు గెలిచారు. దీంతో ఆస్తులు తిరిగి అప్పగించారు వాణిశ్రీ అక్క, బావ. అయితే ఆ తర్వాత వారు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అనారోగ్యం పాలు కావడంతో వారిని ఆదుకున్నారు వాణిశ్రీ. ఇదిలా ఉంటే.. 2020లో వాణిశ్రీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్‌గా పనిచేస్తున్న కుమారుడు అభినయ్‌ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. వాణిశ్రీ చివరిగా నటించిన సినిమా భద్రాద్రి రాముడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  

500 కోట్ల క్లబ్ లో సైయారా.. వార్-2 టార్గెట్ 1000 కోట్లు!

Publish Date:Aug 6, 2025

  ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు సైతం రూ.200-300 కోట్ల గ్రాస్ రాబట్టడం కష్టమైపోయింది. ఇలాంటి సమయంలో కొత్తవాళ్లు నటించిన 'సైయారా' సినిమా.. ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించింది. (Saiyaara Collections)   'మర్డర్ 2', 'ఆషికీ 2', 'ఏక్ విలన్', 'మలంగ్' వంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైయారా'. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాతో ఆహాన్ పాండే, అనీత్ పడ్డా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పెద్దగా అంచనాలు లేకుండా జూలై 18న థియేటర్లలో అడుగుపెట్టిన 'సైయారా' మూవీ.. సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం 19 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.502 కోట్ల గ్రాస్ రాబట్టింది సమాచారం.    ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'ఛావా' నిలిచింది. ఇది దాదాపు రూ.800 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ.500 కోట్ల గ్రాస్ తో.. ఆ తర్వాతి స్థానంలో 'సైయారా' నిలిచింది. ఫుల్ రన్ లో రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.   మరో వారం రోజులు 'సైయారా' బాక్సాఫీస్ రన్ కొనసాగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆగస్టు 14న 'వార్-2' (War 2) విడుదల కానుంది. ఇది కూడా యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లోనే రూపొందడం విశేషం. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. బిగ్ స్టార్స్ కలిసి నటించిన మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా పాజిటివ్ టాక్ కూడా వస్తే.. 'వార్-2' మూవీ సులభంగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నట్లు అవుతుంది.  

అందరూ కలిసి నాకు వెన్నుపోటు పొడిచారు... తెర వెనుక నాగబాబు కష్టం!

Publish Date:Aug 7, 2025

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో నటుడు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ మొదలై పుష్కరం పూర్తైన సందర్భంగా 12 ఏళ్ళ సంబరాలు చేసుకుంటోంది. ఇక ఈ సెలెబ్రేషన్స్ కి కొత్త పాత కమెడియన్స్ అంతా కూడా మళ్ళీ ఒక చోట చేరారు. అలాగే జడ్జ్ నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలానే స్కిట్స్ కి పడీపడీ నవ్వుతూ ఉన్నారు. ఐతే ఇందులో ఆది ఒక స్కిట్ వేసాడు. అందులో ఎవరు ఎవరిని పొడిచి పైకొచ్చారో చెప్పాడు. జబర్దస్త్ లో అందరూ కట్టప్పలే బాహుబలులు ఎవరూ లేరు. ఒకరు పైకి రావడానికి ఇంకొకరు టీం లీడర్స్ ని పొడిచి పైకి వచ్చినవాళ్లే అంటూ చెప్పాడు. దాంతో నాగబాబు ఈ పాయింట్ కి బాగా కనెక్ట్ అయ్యారు. చలాకి చంటిని అందరూ పొడిచారు అని చెప్పాడు ఆది. ఆది నీకు అసలు విషయం తెలియడం లేదు. ఇక్కడ ఉన్న అందరూ నన్ను పొడిచారు..ఆ విషయం నీకు ఇంకా తెలియడం లేదు. ఈ స్టేజి మీద నన్ను ప్రతీవాళ్ళూ పొడిచారు. చంటి వీపు జల్లెడ ఐతే నాకు అసలు వెనక ఏమీ లేదు. వేరే స్కిన్ కప్పుకుని  తిరుగుతున్నా అంటూ చాలా ఫీలయ్యారు. ఈ సెలెబ్రేషన్స్ లో చమ్మక్ చంద్ర, అదిరే అభి, రైజింగ్ రాజు, బలగం వేణు, హైపర్ ఆది, గెటప్ శీను, ధనరాజ్, షకలక శంకర్ ఇలా అందరూ ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. ఎవరి గురువులకు వాళ్లకు కాళ్ళు కడిగి వాళ్ళ గురించి నాలుగు మంచి మాటలు చెప్పుకున్నారు.  ఇక చాన్నాళ్ల తర్వాత నాగబాబు నవ్వును మళ్ళీ జబర్దస్త్ స్టేజి మీద వింటున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ భారీ మల్టీస్టారర్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Publish Date:Aug 7, 2025

  ఇండియన్ సినిమాలో గత కొన్నేళ్లుగా పలు భారీ మల్టీస్టారర్ లు వస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకున్న 'వార్-2' ఈ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే 'రామాయణ'లో రణబీర్ కపూర్, యశ్ కలిసి నటిస్తున్నారు. త్వరలో అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో కూడా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశముందని తెలుస్తోంది.   'కేజీఎఫ్', 'కాంతార', 'సలార్' వంటి సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటిన హోంబలే ఫిలిమ్స్.. అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను రంగంలోకి దింపాలని చూస్తోందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని, అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.   ప్రస్తుతం అల్లు అర్జున్, షారుఖ్ ఖాన్, ప్రశాంత్ నీల్ ముగ్గురూ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అట్లీతో బన్నీ ఓ భారీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేస్తున్నాడు. షారుఖ్ చేతిలో 'కింగ్' మూవీ ఉంది. నీల్ కూడా ఎన్టీఆర్ తో 'డ్రాగన్' అనే భారీ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ల తర్వాత.. వీరి కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ కు హోంబలే ఫిలిమ్స్ శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి.   ఈ మల్టీస్టారర్ సాధ్యమైతే మాత్రం.. కేవలం ప్రకటనతోనే సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక విడుదల తర్వాత ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని చెప్పవచ్చు.  

Hansika Motwani indirectly confirms divorce rumors?

Publish Date:Aug 5, 2025

Hansika Motwani rose to stardom with Telugu film Deshamuduru. The beautiful lady became a rage among youth and she earned even more popularity in Tamil Cinema. She got married to Sohael Khaturiya in December 2022. The couple have released their wedding drama as a video on OTT platform, too.  Sohael being husband of Haniska's close friend, before their marriage, she even faced homewrecker tags. But Hansika stayed strong in her decision to get married to him. Recently, the rumors have been aplenty that the couple have separated and are applying for divorce.  Adding to fuel to all rumors, she deleted all her wedding photos and vidoes. Even all her photos with Sohael, on her Instagram page. This is being reported as an indirect confirmation about her divorce. Neither she nor Sohael have given any public statement but reports suggest that the couple are irreconcilable.  The actress became a Judge on TV shows like Dhee and she has been busy with several movie projects too. Earlier, Hansika had been in a relatioship with Silambarasan aka Simbu and after a public break-up, she announced her relationship with Sohael and even before three years, the couple are heading towards divorce.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

కింగ్‌డమ్

Publish Date:Jul 31, 2025

జూనియర్

Publish Date:Jul 18, 2025

Kingdom

Publish Date:Jul 31, 2025

Mahavatar Narsimha

Publish Date:Jul 25, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025