English | Telugu
తిరుపతిలో బీజేపీ గెలిస్తేనే ఏడు కొండలు సేఫ్! జగన్ పై సత్యకుమార్ సంచలన కామెంట్లు
Updated : Nov 21, 2020
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సత్యకుమార్. ఒక మత వ్యాప్తి కోసం జగన్ పాకులాడుతున్నారని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, అవినీతికి కొత్తమార్గాలను అన్వేషించడంలో ముఖ్యమంత్రి దిట్ట అన్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనాలోచిత నిర్ణయాలు జగన్‌కే సాధ్యమన్నారు సత్యకుమార్. టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు దోచిపెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇసుకను అధికార పార్టీ నేతలు లూఠీ చేస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతి మొత్తాన్ని త్వరలో బట్ట బయలు చేస్తామన్నారు సత్యకుమార్.