English | Telugu

బీహార్ లో బీజేపీకి లీడ్! మారుతున్న ట్రెండ్స్ 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్టిట్ పోల్స్ అంచనాలు తలకిందులవుతున్నాయి. ఫలితాల సరళి వేగంగా మారిపోతోంది. తొలి రౌండ్లలో లీడ్ లో ఉన్నట్లు కనిపించిన మహాగట్ బంధన్ ఇప్పుడు వెనకబడి పోయింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అభ్యర్థులే మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. తాజా ట్రెండ్స్ ప్రకారం బీహార్ లో బీజేపీ ఏకైక పెద్ద పార్టీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమి మెజారిటీ మార్క్‌ను దాటే అవకాశాలు ఉన్నాయి.

బీహార్ లో మొత్తం మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతానికి 120కి పైగా నియోజకవర్గాల్లో ఎన్డీయే ఆధిక్యం కొనసాగిస్తోంది. మహాఘట్ బంధన్ 105 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.nఎన్డీఏ కూటమిలో బీజేపీ 72 స్థానాల్లో, జేడీయూ 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మహా ఘట్ బంధన్ కూటమిలో 65 స్థానాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ 20 , కమ్యూనిస్టులు 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎల్‌జేపీ 2 స్థానాల్లో, వీఐపీ 7 స్థానాల్లో, ఇతరులు 29 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం మూడు స్థానాల్లో లీడ్ లో ఉంది.