English | Telugu

ఉపాసనకి తన బాధ్యతని గుర్తు చేస్తున్న చిరంజీవి

ఉపాసనకి తన బాధ్యతని గుర్తు చేస్తున్న చిరంజీవి

Publish Date:Aug 4, 2025

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)కోడలు, గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)సతీమణి 'ఉపాసన కొణిదెల'(upasana Konidela)గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చాలా సంవత్సరాల నుంచి సామాజిక బాధ్యతతో పాటు, జంతు ప్రేమికురాలుగా పలు సేవా కార్యక్రమాలు  చేస్తు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 'ఉపాసన' ని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ హబ్(Telangana Sports Hub)కి కో చైర్ పర్సన్ గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తు 'మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కి కో చైర్ పర్సన్.  గౌరవనీయమైన పదవిలో తనని నియమించడం చాలా సంతోషంగా ఉంది. గౌరవం కంటే బాధ్యతని మరింత పెంచిందని చెప్పాలి. డియర్ ఉపాసన మీకున్న నిబద్ధత, ఫ్యాషన్ తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభని గుర్తించి  ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలు రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. నీ ప్రయాణంలో ఆ దేవుడు దీవెనలు తప్పకుండా ఉంటాయని ట్వీట్ చేసాడు. లండన్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన ఉపాసన, చాలా సంవత్సరాల నుంచి మహిళలు తమ సొంతంగా వ్యాపారం చేసుకొని నిలదొక్కుకునేలా సలహాలు ఇస్తు ఉంది. .తెలంగాణలోని కామారెడ్డి జిల్లా  దోమకొండ(Domakonda)ఉపాసన స్వస్థలం. తండ్రి అనిల్ కామినేని, శోభన సుదీర్ఘ కాలం నుంచి వ్యాపార రంగంలో రాణిస్తు వస్తున్నారు.  
Adivi Sesh's G2 to Explode on screens next Summer

Adivi Sesh's G2 to Explode on screens next Summer

Publish Date:Aug 4, 2025

The spy game is back, bigger, bolder, and more explosive than ever. G2, the much-anticipated sequel to the acclaimed thriller Goodachari, is officially set for a worldwide theatrical release on May 1, 2026. Starring Adivi Sesh, G2 raises the stakes with an all-new mission and a global canvas. To mark the announcement, the makers have released several posters, each hinting at a different aspect of the film’s high-octane action. Directed by Vinay Kumar Sirigineedi in his directorial debut, the film builds on the success of its predecessor while expanding the scope to a truly international scale. Shot across six countries over 150 days, with 23 intricately designed sets, G2 is being mounted as a high-stakes, high-style thriller set to redefine genre standards in Indian cinema. Joining the franchise as Agent 116, Wamiqa Gabbi brings both emotional depth and fierce intensity to the story. The ensemble cast includes Emraan Hashmi, making his Telugu debut, along with Murali Sharma, Supriya Yarlagadda, and Madhu Shalini in pivotal roles. Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under the banners of People Media Factory, Abhishek Agarwal Arts, and AK Entertainments, G2 will be released in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam languages. With its powerful cast, global production values, and an ambitious vision, G2 is shaping up to be a defining action thriller of 2026.

తను సినిమా నటినని కోర్టులో ప్రూవ్‌ చేసుకున్న వాణిశ్రీ.. ఎందుకో తెలుసా? 

Publish Date:Aug 2, 2025

(ఆగస్ట్‌ 3 వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రిది ఒక శకం అని చెప్పొచ్చు. సావిత్రిలాంటి నటి మరొకరు లేరు, రారు అనుకుంటున్న సమయంలో ఓ వెలుగులా చిత్ర పరిశ్రమలోకి దూసుకొచ్చారు వాణిశ్రీ. సావిత్రి పోలికలతోనే వాణిశ్రీ ఉందని అందరూ అనుకున్నారు. సావిత్రి మాదిరిగానే మొదట చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కథానాయికగా ఎదిగారు. పొగరు గల ధనవంతురాలిగా, ఆత్మాభిమానం కలిగిన మధ్య తరగతి యువతిగా, అమాయకురాలిగా, అణకువ కలిగిన భార్యగా, చిలిపి పనులు చేస్తూ నవ్వించే అమ్మాయిగా.. ఇలా ఏ పాత్రలోనైనా తన అద్భుతమైన నటనతో మెప్పించగల ప్రతిభాశాలి వాణిశ్రీ.  1948 ఆగస్ట్‌ 3న నెల్లూరులో రాఘవయ్య, వెంకమ్మ దంపతులకు రెండో కుమార్తెగా జన్మించారు వాణిశ్రీ. ఆమె అసలు పేరు రత్నకుమారి. చిన్నతనంలోనే టి.బి.తో తండ్రి చనిపోయారు. ఒక్క నెలలోనే వారి కుటుంబంలోని ముగ్గురు అదే వ్యాధితో మరణించారు. వెంకమ్మ తన ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగించారు. వాణిశ్రీ చదువుకుంటూనే నాట్యం నేర్చుకున్నారు. స్కూల్‌లో జరిగిన ఒక ఫంక్షన్‌లో వాణిశ్రీ డాన్స్‌ చూసిన కన్నడ డైరెక్టర్‌ హునుసూరు కృష్ణమూర్తి.. తను చేస్తున్న వీరసంకల్ప చిత్రంలో తొలి అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలోని నటనకు, చేసిన డాన్సులకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఎన్నో నాటకాల్లో నటించారు వాణిశ్రీ. ముఖ్యంగా చిల్లకొట్టు చిట్టెమ్మ, రక్తకన్నీరు, రాగరాగిణి, దొంగ వంటి నాటకాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. వీరసంకల్ప రషెస్‌ చూసిన బి.విఠలాచార్య నవగ్రహ పూజా మహిమ చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు. ఆ తర్వాత కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు.  ఎ.వి.ఎం సంస్థ నిర్మించిన నానుమ్‌ ఒరుపెణ్‌ చిత్రాన్ని తన సొంత బేనర్‌ శ్రీవాణి ఫిలింస్‌ పతాకంపై నాదీ ఆడజన్మే పేరుతో నిర్మించాలనుకున్నారు ఎస్‌.వి.రంగారావు. అందులోని ప్రధాన పాత్ర కోసం వాణిశ్రీని ఎంపిక చేశారు. ఆ సమయంలోనే తమ బేనర్‌ పేరు కూడా కలిసి వచ్చేలా రత్నకుమారి పేరును వాణిశ్రీగా మార్చారు ఎస్వీఆర్‌. అయితే కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర జమునకు దక్కింది. బాలీవుడ్‌ నటి వైజయంతిమాలను వాణిశ్రీ ఆదర్శంగా తీసుకున్నారు. నటనలోని మెళకువలు, డైలాగులు ఎలా చెప్పాలి వంటి విషయాలు ఎస్వీఆర్‌ నేర్పించారు. 1967లో వచ్చిన మరపురాని కథ వాణిశ్రీ భవిష్యత్తుకు మంచి పునాది వేసింది. అప్పటివరకు జానపద చిత్రాలు రాజ్యమేలాయి. వాణిశ్రీ ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికి జానపదాలు తగ్గుతూ వచ్చాయి. ఆ సమయంలోనే ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు వాణిశ్రీ.  ఇలా ఉండగా, 1969లో అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ఆత్మీయులు చిత్రంలో తొలిసారి అక్కినేని నాగేశ్వరరావు సరసన నటించారు వాణిశ్రీ. ఈ సినిమాలో మొదట అక్కినేనికి చెల్లెలుగా నటించమని అడిగారు నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు. కానీ, తను హీరోయిన్‌గా అయితేనే చేస్తానని పట్టుబట్టి దాన్ని సాధించుకున్నారు. అక్కినేనికి చెల్లెలుగా విజయనిర్మల నటించారు. ఆ తర్వాత అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌లోనే వచ్చిన భలే రంగడు కూడా ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్‌తో నటించిన తొలి సినిమా నిండు హృదయాలు. హాస్యనటుడు పద్మనాభం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కథానాయిక మొల్ల చిత్రంలో మొల్ల పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు వాణిశ్రీ. ఈ సినిమాకి నంది అవార్డు లభించింది.  సాధారణంగా హీరోలకు లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ, వాణిశ్రీకి మహిళా అభిమానులు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆమె చీరకట్టుకునే విధానం, హెయిర్‌ స్టైల్‌, జ్యూయలరీ.. మహిళలను విపరీతంగా ఆకర్షించేవి. ఈ విషయాల్లో వాణిశ్రీ ఎన్నో ప్రయోగాలు చేశారు. తన గెటప్‌ విషయంలో ఆమెకు పూర్తి అవగాహన ఉండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమె ఏది చేస్తే అదే బెస్ట్‌ అనేవారు. ఒక శిల్పంలా అందంగా కనిపించేందుకు వాణిశ్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. సరైన డైట్‌ పాటిస్తూ స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నించేవారు. ఆరోజుల్లో నవలా పఠనం ఎక్కువగా ఉండేది. ఆయా నవలల్లో కథానాయిక ఎలా ఉందని వర్ణిస్తారో దానికి నిజమైన రూపంగా వాణిశ్రీ కనిపించేవారు. అందుకే లెక్కకు మించిన నవలా చిత్రాల్లో వాణిశ్రీ హీరోయిన్‌గా నటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వాణిశ్రీ తర్వాత నవలా నాయిక అని పేరు తెచ్చుకున్న నటి మరొకరు లేరు.  1970 దశకం వచ్చేసరికి వాణిశ్రీ టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌,  శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, హరనాథ్‌, కాంతారావు, రంగనాథ్‌, రామకృష్ణ వంటి అగ్రశ్రేణి హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. అలా వచ్చిన దసరాబుల్లోడు, కొడుకు కోడలు, ప్రేమనగర్‌, బంగారుబాబు, దేశోద్ధారకులు, ఎదురులేని మనిషి, ఎదురీత, కన్నవారి కలలు, గంగ-మంగ, చక్రవాకం, జీవనజ్యోతి, ఇల్లు ఇల్లాలు, రైతుబిడ్డ, చీకటి వెలుగులు, చక్రధారి, భక్తకన్నప్ప, జీవనతరంగాలు, కృష్ణవేణి, వంటి ఎన్నో సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించాయి. తమిళంలో శివాజీ గణేశన్‌ వంటి అగ్రశ్రేణి నటులతో 80 సినిమాల్లో వాణిశ్రీ నటించారు. అలాగే కన్నడలో రాజకుమార్‌ వంటి హీరోల సరసన 30 సినిమాల్లో నటించారు. అయితే మలయాళంలో మాత్రం కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 1981లో వచ్చిన దేవుడు మావయ్య హీరోయిన్‌గా ఆమె చివరి సినిమా. ఆమె కెరీర్‌లో మేకప్‌ లేకుండా నటించిన సినిమాలు రెండు. బాపు దర్శకత్వంలో వచ్చిన గోరంతదీపం, శ్యామ్‌ బెనెగల్‌ దర్శకత్వంలో రూపొందిన అనుగ్రహం. హీరోయిన్‌గా కొన్ని వందల సినిమాల్లో నటించినప్పటికీ తను చేసిన సినిమాల్లో కృష్ణవేణి, ఇద్దరు అమ్మాయిలు మాత్రమే తనకు నచ్చిన సినిమాలని చెబుతారు వాణిశ్రీ.  హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నప్పుడే జరిగిన ఓ సంఘటన వాణిశ్రీ సినిమాలు విరమించడానికి కారణమైంది. అప్పటివరకు ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్‌.. కమర్షియల్‌ హీరోగా నటించిన సినిమా ఎదురులేని మనిషి. ఈ సినిమాను కె.బాపయ్య డైరెక్ట్‌ చేశారు. ఈ సినిమాలోని కసిగా ఉంది.. కసికసిగా ఉంది.., కృష్ణా ముకుందా మురారి.. అనే పాటల చిత్రీకరణ వాణిశ్రీని ఎంతో బాధపెట్టాయి. అప్పటివరకు ఏ సినిమాలోనూ అలాంటి పాటలు వాణిశ్రీ చేయలేదు. ఇలాంటి డాన్సులు చేయడం వల్ల ప్రేక్షకుల్లో తనపై ఉన్న గౌరవం పోతుందని భావించిన వాణిశ్రీ.. ఆ పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే సినిమాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే చాలా సినిమాలు కమిట్‌ అయి ఉండడం వల్ల అవి పూర్తి చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అలా దేవుడు మావయ్య చిత్రంతో హీరోయిన్‌గానే రిటైర్‌ అయ్యారు వాణిశ్రీ.  సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్న మరుసటి సంవత్సరం 1978లో చెంగల్పట్టుకు చెందిన డాక్టర్‌ కరుణాకరన్‌ను వివాహం చేసుకున్నారు వాణిశ్రీ. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వాణిశ్రీ సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ తన అక్క భర్త చూసుకునేవారు. అలా చాలా ఆస్తులు ఆమె బావ పేరు మీదే ఉన్నాయి. పెళ్ళి తర్వాత తన ఆస్తులు తిరిగి ఇవ్వాలని వాణిశ్రీ కోరారు. దానికి ఆమె అక్క, బావ ఇద్దరూ ఒప్పుకోకవడంతో వాణిశ్రీ భర్త కోర్టుకెక్కారు. కొన్ని సంవత్సరాలపాటు ఈ కేసు కోర్టులోనే ఉంది. ఒక దశలో తన పేరు వాణిశ్రీ అనీ, ఆ ఆస్తులన్నీ సినిమాల్లో నటించడం ద్వారానే సంపాదించానని నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమాల్లో నటించడం ద్వారా నిర్మాతలు డబ్బు ఇచ్చినట్టు అగ్రిమెంట్లు ఉంటే కేసు గెలుస్తామని వాణిశ్రీ తరఫు న్యాయవాది చెప్పడంతో ఆ ప్రూఫ్‌ కోసం సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. అలా నటించిన మొదటి సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడమే కాకుండా వాణిశ్రీ పోషించిన అత్త క్యారెక్టర్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో మళ్లీ అవకాశాలు వెల్లువెత్తాయి. అలా బొబ్బిలిరాజా, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, పెద్దింటల్లుడు, స్వాతిచినుకులు, రాజేశ్వరీ కళ్యాణం వంటి వైవిధ్యమైన సినిమాల్లో వాణిశ్రీ నటించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ 60 సినిమాలు చేయడం విశేషం.  సినిమాలు వద్దనుకొని 1981లోనే రిటైర్‌ అయిన వాణిశ్రీ.. తాను సినిమాల్లో నటించడం ద్వారా ఆస్తులు సంపాదించానని నిరూపించుకోవడం కోసమే తన సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభించారు. మొదటి ఇన్నింగ్స్‌లో, సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ తన స్థాయికి తగిన సినిమాలే చేశారు తప్ప విమర్శలకు తావిచ్చే క్యారెక్టర్స్‌ వాణిశ్రీ ఎప్పుడూ చేయలేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సినిమాలు చేయడం ద్వారా కోర్టు కోరిన అగ్రిమెంట్లు సమర్పించి కేసు గెలిచారు. దీంతో ఆస్తులు తిరిగి అప్పగించారు వాణిశ్రీ అక్క, బావ. అయితే ఆ తర్వాత వారు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అనారోగ్యం పాలు కావడంతో వారిని ఆదుకున్నారు వాణిశ్రీ. ఇదిలా ఉంటే.. 2020లో వాణిశ్రీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్‌గా పనిచేస్తున్న కుమారుడు అభినయ్‌ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ షాక్‌కి గురిచేసింది. వాణిశ్రీ చివరిగా నటించిన సినిమా భద్రాద్రి రాముడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు.  

7 నెలల్లో 110 కోట్ల ఆస్తుల అమ్మకం.. విదేశాలకు జంప్‌ అవుతున్న స్టార్‌ హీరో?

Publish Date:Aug 4, 2025

సాధారణంగా చిత్ర పరిశ్రమలోని నటీనటులు తమ కెరీర్‌ ఉజ్వలంగా సాగుతున్న సమయంలో వాళ్లు సంపాదించిన దాన్ని ఎక్కువ శాతం ఆస్తులు కొనడంలోనే ఉపయోగిస్తారు. అలా చిత్ర పరిశ్రమలో కుబేరులుగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే వారికి భిన్నంగా ఒక బాలీవుడ్‌ స్టార్‌ హీరో తన ఆస్తుల్ని ఒక్కొక్కటిగా అమ్ముతూ వస్తున్నారు. జనవరిలో మొదలుపెట్టి ఇప్పటివరకు 8 ఆస్తుల్ని కొన్న దానికంటే కొన్ని రెట్లు లాభాలకు అమ్మేశారు. అలా ఇప్పటివరకు 100 కోట్లు పొందారు. అతనెవరో కాదు, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌.  ముంబైలో ఉన్న తన ఆస్తుల్ని వరసగా అమ్మడం బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అక్షయ్‌ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ముంబాయిలోని బోరివాలి, వర్లి, లోయర్‌ పరేల్‌లోని లగ్జరీ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను అమ్మేశారు. దీనిపై బాలీవుడ్‌లో భారీగా చర్చలు జరుగుతున్నాయి. అలాగే సోషల్‌ మీడియాలో కూడా నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ముంబై నుంచి అక్షయ్‌ మకాం మారుస్తున్నాడనేది ప్రధానంగా వినిపిస్తున్న వార్త. ఇండియాలో కాకుండా విదేశాల్లో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడన్నది మరో వార్త. ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వార్తపై అక్షయ్‌ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.  1987లో ‘ఆజ్‌’ చిత్రంలో కరాటే ఇన్‌స్ట్రక్టర్‌గా చిన్న పాత్రలో తొలిసారి కనిపించారు అక్షయ్‌కుమార్‌. ఆ తర్వాత నాలుగేళ్ళపాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. 1991లో ‘సౌగంధ్‌’ చిత్రంలో తొలిసారి హీరోగా నటించే అవకాశం వచ్చింది. మరో రెండు సినిమాల్లో నటించిన తర్వాత ‘ఖిలాడి’ చిత్రం అక్షయ్‌కి బ్రేక్‌ ఇచ్చింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా, మంచి డాన్సర్‌గా, ఫైటర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు. అక్షయ్‌కి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ. చాలా సంవత్సరాలు అతను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌ విదేశాలకు వెళ్లిపోతున్నాడన్న వార్త వైరల్‌ అయిపోవడంతో దీనిపై అతను ఎలాంటి క్లారిటీ ఇస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 కన్ఫమ్ కంటెస్టెంట్స్ ఎవరంటే!

Publish Date:Aug 4, 2025

  బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ నెల చివర్లో మొదలవ్వబోతుంది. అయితే ఇప్పటికి ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తున్నారని చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతీ సీజన్ లో  కామన్ మ్యాన్ ఎవరస్తారనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. అయితే ఈ కేటగిరీ నుండి ఎవరనేది ఇంకా సస్పెన్సుగానే ఉంది. బిగ్ బాస్ గ్రాంఢ్ లాంచ్ రోజు ఎంతమంది ఎంట్రీ ఇస్తారో, వైల్డ్ కార్డుగా ఎంతమంది అనేది ప్రతీ సీజన్ కి ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా ఒక్కటేమిటి బిగ్ బాస్ గురించి ప్రతి ఒక్కటి ట్విస్ట్ లాగే ఉంది. అమరదీప్ భార్య తేజస్విని గౌడ కన్ఫమ్ కంటెస్టెంట్ అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీతు చౌదరి, మై విల్లేజ్ షో అనిల్ జీలా, సీరియల్ యాక్టర్ నవ్య స్వామి, అలేఖ్య చిట్టి పిక్కిల్ చిట్టి, తెల‌ంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగ దుర్గ, సీరియల్ యాక్టర్ సాయి కిరణ్, శివ కుమార్, దెబ్జానీలతో పాటు కమెడియన్ ఇమ్మాన్యుయెల్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరితో పాటుగా  సింగర్ కేటగిరీ నుండి శ్రీతేజ ఎంట్రీ ఇస్తున్నాడంట. సీరియల్ యాక్టర్ దీపిక రంగరాజు, కేరింత మూవీ హీరో సుమంత్ అశ్విన్ కూడా సీజన్ 9(Bigg Boss 9 Telugu) కి వస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఇంకా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారనేది తెలియాలంటే సీజన్ 9 గ్రాంఢ్ లాంఛ్ వరకు ఆగాల్సిందే.   

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

'కాంతార-3'లో జూనియర్ ఎన్టీఆర్.. థియేటర్లలో పూనకాలే!

Publish Date:Aug 4, 2025

  పాన్ ఇండియా స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ లైనప్ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇతర భాషల దర్శకులతో చేతులు కలుపుతున్నాడు. ఇప్పటికే 'వార్-2' అనే హిందీ ఫిల్మ్ చేశాడు. ఇది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'డ్రాగన్' మూవీ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు నెల్సన్ తోనూ ఓ సినిమా కమిటై ఉన్నాడు. ఇక ఇప్పుడు మరో కన్నడ డైరెక్టర్ తో ఎన్టీఆర్ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. రిషబ్ శెట్టి.   'కాంతార'తో నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో 'కాంతార-2' రూపొందుతోంది. ఇది అక్టోబర్ 2న విడుదల కానుంది. రిషబ్ 'కాంతార-3'ను కూడా ప్లాన్ చేస్తున్నాడు. అంతేకాదు, ఇందులో ఒక కీలక పాత్ర కోసం ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం.    ఎన్టీఆర్, రిష‌బ్ శెట్టి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ కర్ణాటకకు వెళ్తే.. ప్రశాంత్ నీల్ తో పాటు రిషబ్ ని కూడా కలుస్తుంటాడు. దాంతో వీరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పుడు 'కాంతార-3'లో ఎన్టీఆర్ నటించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా న్యూస్ వినిపిస్తోంది. అదే జ‌రిగితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.  

Mrunal Thakur and Dhanush dating each other?

Publish Date:Aug 2, 2025

Rumuor mills have always been active about an alleged closeness, relationship or probable friendship of an actor and actress. Now, they are busy talking about Dhanush and Mrunal Thakur, possibly dating with each other. The rumors are spreading wide as Mrunal and Dhanush have been seen talking to each other, cordially, at an event. Mrunal specially went to Dhanush to speak to him and this sparked even more rumors about their closeness. The clip of them talking to each other has been going viral on social media platforms and it has become a talking point everywhere. Dhanush took divorce from Aishwarya Rajinikanth after long separation.  So, many have been speculating about his possible romantic link-ups with other actresses. Dhanush has been concentrating more on his work with non-stop projects as a director and actor. At this point, it feels like he has no time for anything else in his life, other than work and his two boys.  Well, the actor has been linked up many actresses in the past and there have been many rumors about his extra-marital affairs, too. But he seems to be more occupied with work and hence, such rumors cannot be believed instaneously. Let's wait and watch.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

కింగ్‌డమ్

Publish Date:Jul 31, 2025

జూనియర్

Publish Date:Jul 18, 2025

Kingdom

Publish Date:Jul 31, 2025

Mahavatar Narsimha

Publish Date:Jul 25, 2025

Hari Hara Veera Mallu

Publish Date:Jul 24, 2025

Junior

Publish Date:Jul 18, 2025

Oh Bhama Ayyo Rama

Publish Date:Jul 11, 2025