English | Telugu
కార్పొరేటర్ల కొనుగోళ్ల కోసమే గ్రేటర్ మేయర్ ఎంపిక ఆలస్యం!
Updated : Dec 18, 2020
చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అవినీతికి పాల్పడనని.. అభివృద్ధికి తోడ్పడుతానని బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు సంజయ్. ఈ సందర్భంగా మట్లాడిన సంజయ్.. హైదరాబాద్ నగర అభివృద్ధికి బీజేపీ తప్పకుండా సహకరిస్తుందని చెప్పారు. కేంద్ర నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లో అభివృద్ధి ఆగిపోయిందన్నారు బండి సంజయ్.