English | Telugu

రాజ్ భవన్ చేరిన ఏపీ మూడు రాజధానులు బిల్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లుని రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపించింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ బిల్లును ఆమోదిస్తే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని విషయంపైనే ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్రమంతా కరోనా విజృంభణతో అల్లాడుతుంటే ప్రభుత్వం మూడు రాజధానులు విషయం లో ఆసక్తి చూపిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.