English | Telugu
ప్రభుత్వ వేతనాలు ఎప్పుడు వచ్చేను?
Updated : Oct 4, 2019
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకా వేతనాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. గురువారం కొందరికే జమ కాగా, ఇంకా ఎనభై వేల మందికి పెండింగ్ లో ఉన్నాయి. నిధుల కొరత కారణంగా అక్టోబరు ఒకటో తేదీన చాలామంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు పడలేదు. గురువారం జమవుతాయని వారంతా ఆశించారు. కానీ కొద్ది మందికే విడుదల చేశారు. రెగ్యులర్ ఉద్యోగులలో ఇంకా సుమారు నలభై వేల మందికి మరో నలభై వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. వేతనాలు పెన్షన్ లు కలిపి నెలకు ఐదు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలోకి అక్టోబరు నుంచి గ్రామ వాలంటీర్లు కూడా చేరారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరుకుంది. పెన్షనర్ల సంఖ్య మూడు పాయింట్ ఏడు లక్షలు ఉంది. కాగా ఉద్యోగుల వేతనాలు పెన్షన్ లకు ఇప్పుడు నెలకు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని ఇందులో అక్టోబర్ ఒకటిన చెల్లింపులు మూడు వేల నూట యాభై కోట్లు చెల్లించామని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ వివరించారు. డబ్బుల్లేవు శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనం పై ఆయన స్పందించారు. గతంలో అన్ని నెలల్లో ఒకటో తేదిన చెల్లించిన మొత్తం కంటే అక్టోబరు ఒకటిన నూట యాభై కోట్లు ఎక్కువే చెల్లించామని ఓ ప్రకటనలో వెల్లడించారు.వారి వేతనాలు ఎప్పుడు వస్తాయా అని ఉద్యోగులు వేయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.