English | Telugu
ఏపీలో గద్వాల్ మోడల్ అమలు చేస్తారా?
Updated : Apr 27, 2020
కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తునే వున్నాయి. మందు లేని కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే కఠినమైన విధానాల్ని అమలు చేయటానికి మినహా మరో మార్గం లేదు. తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం కోసం వినూత్న విధానాన్ని అమలు చేశారు. వైరస్ కు పుట్టిల్లు అయిన వూహాన్ లో అక్కడి అధికారులు అమలు చేసిన విధానాల్ని గద్వాల్ లోనూ చేపట్టారు. దీని కారణంగా వైరస్ వ్యాప్తి కంట్రోల్ కి వచ్చింది. ఇంతకీ ఈ విధానాన్ని ఎలా అమలు చేస్తారు?
గద్వాల్ పట్టణం లోని పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయటం.. రహదారుల్ని మూసి వేయటంతో పాటు.. ప్రతి ఇంటికి అధికారులు తాళాలు వేసేస్తారు.దీంతో.. ఇంట్లోని వారుఇంట్లోనే ఉండిపోవాలే తప్పించి..కనీసం బయటకు కూడా వచ్చే వీలుండదు. దీంతో.. ప్రమాదకర వైరస్ వ్యాప్తి ఎక్కడికక్కడ.. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే ఆగిపోతుంది.
కరోనా ఆంక్షలు ఉన్నప్పటికి చాలాచోట్ల ఒక ఇంట్లో వారు మరో ఇంట్లోకి రాకపోకలు సాగించటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఎవరింట్లో వారిని లాక్ చేసే పద్దతి గద్వాల్ లోని కంటైన్ మెంట్ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేశారు. సరిగ్గా ఇదే విధానాన్ని ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో గద్వాల్ మోడల్ ను అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు.
ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కవ ఎక్కువగా వున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్ని పూర్తిగా మూసివేయటమే కాదు. ఇళ్లకు తాళాలు వేసేయాలి. అయితే.. ఇలా ఇళ్లకు తాళాలు వేసిన ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యవసరాల్ని.. ఇతర వస్తువుల్ని అధికారులే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు.