English | Telugu
స్వరూపానంద చొరవ.. వారణాసి నుంచి స్వస్ధలాలకు 44 మంది తెలుగు వారు..
Updated : Apr 16, 2020
వారణాసిలోని ఆంధ్ర ఆశ్రమంతో పాటు శారదాపీఠం వారణాసి శాఖ సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మూడు వారాల ఇబ్బందుల తర్వాత వారిని స్వస్ధలాలకు పంపేందుకు ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే దారి పొడవునా ఇబ్బందులు, ఆహారం సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆశ్రయ నిర్వాహకులే వీరికి మార్గమధ్యంలో ఆహార కొరత లేకుండా భోజన ప్యాకెట్లను తయారు చేసి యాత్రికులకు అందించారు. యూపీ ప్రభుత్వం తరఫున పోలీసులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. దీంతో వీరు అక్కడి నుంచి స్వస్ధలాలకు బయలుదేరారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను స్వస్ధలాలకు చేర్చేందుకు శారదాపీఠాధిపతులు చూపిన చొరవపై ఇప్పుడు ప్రసంశల జల్లు కురుస్తోంది.