English | Telugu
ఎయిర్ ఇండియాలో లైంగిక వేధింపులు
Updated : May 30, 2018
అతను ఆ సంస్థలో ఓ ఉన్నతోద్యోగి. అతని మీద సిబ్బంది ఎవ్వరూ చీమ వాలనివ్వరు. అతను నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని మొత్తుకున్నా పట్టించుకోరు. దాంతో ఓ ఉద్యోగినికి ఏం చేయాలో పాలుపోలేదు. అలాగని అతని వేధింపులని తట్టుకోవడానికీ ఆమె సిద్ధంగా లేదు. అందుకని నేరుగా ప్రధానమంత్రికీ, విమానయాన శాఖ మంత్రికీ ఓ లేఖ రాసింది. ‘మీరు అడపిల్లని కనండి, ఆడపిల్లని చదివించండి అని చెబుతారు. మరి చదువుకున్న ఆ ఆడపిల్ల ఇలాంటి వాతావరణంలో పనిచేయడం అంత మంచిది కాదు కదా!’ అని సుతిమెత్తగా దులిపేసింది. దాంతో పౌర విమానయాన మంత్రి సురేష్ ప్రభు ఈ విషయం మీద విచారణ జరిపేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయమని ఆదేశించారు.