అచ్చెన్న గాయం తిరగబెట్టింది.. ఇప్పుడు ఏం చేయబోతున్నారో..?
అచ్చెన్న గాయం తిరగబెట్టింది.. ఇప్పుడు ఏం చేయబోతున్నారో..?
Updated : Jun 16, 2020
ఇఎస్ఐ స్కామ్ లో ఎసిబి అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అరెస్ట్ కు ఒక రోజు ముందు ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరిగి ఉండటం తో పాటు ఎసిబి అరెస్ట్ తరువాత సుదీర్ఘ ప్రయాణం చేయడం తరువాత విచారణ పేరుతొ మరి కొన్ని గంటలు కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఆపరేషన్ గాయం తిరగ పెట్టినట్లు గా తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ కూడా కావడం తో రక్తస్రావం ఆగడం లేదని తెలుస్తోంది. ఆయనకు బీపీ, షుగర్ ఉండటంతో గాయం మానడానికి పదిహేను రోజుల సమయం పట్టవచ్చని సమాచారం అందుతోంది. అచ్చెన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో అయన ఆరోగ్యం పై జీజీహెచ్ డాక్టర్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయడం లేదు. ఐతే అయన ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియ చేస్తున్నట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా అచ్చెన్న తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందువల్ల విడుదల చేయాలని లాయర్లు ఎసిబి కోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. కొద్ది రోజుల్లో ఈ పిటిషన్ సీబీఐ కోర్టులో విచారణకు రావచ్చని తెలుస్తోంది.