English | Telugu
తెలంగాణా ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ ఇంట్లో ఎసిబి సోదాలు...
Updated : Oct 4, 2019
తెలంగాణా ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ ను ఏసీబీ చుట్టుముట్టింది. ఇంటర్ బోర్డులో అక్రమాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మధుసూదన్ కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించిన ఏసీబీ ఆయనతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏక కాలంలో ఎటాక్ చేసింది. తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై ఈ రోజు ఉదయం నుంచి ఎసిబి ఆయన ఇంటితో పాటు ఆయన బావమరిది అయిన చెల్లెలు మొత్తం ఐదు చోట్ల ఏసీబి సోదాలు కొనసాగిస్తుంది.
ఏసిబి చెప్పిన సమాచారం ప్రకారం మధుసూదన్ పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని తేలింది. రెండు వేల ఏడులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు కి సంబంధించి ఇంటర్ పేపర్ లీకేజీ అయ్యింది, ఆ లీకేజ్ లో మధుసూధన్ రెడ్డి పాత్ర ఉందని, దాంతోపాటుగా ఇటీవలే విడుదలయిన ఇంటర్ మార్కుల వ్యవహారంలో చాలా మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది లెక్చరర్స్ పేపర్ లు దిద్దే క్రమంలో కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు, ఈ లెక్చరర్స్ వ్యవహారంలో కూడా మధుసూధన్ కు సంబంధం ఉన్నట్టు ఎసిబి అనుమానిస్తుంది.
అంతేకాకుండా జూనియర్ లెక్చరర్స్ ప్రమోషన్ పేరిట చాలా మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసినట్టు మధుసూధన్ పై ఆరోపణలున్నాయని ఎసిబి చెప్తోంది. ఈ నేపథ్యంలోనే దిల్సుఖ్నగర్ లోని మధుసూధన్ ఇంటిపై ఎసిబి సోదాలు నిర్వహిస్తుంది. మరికాసేపట్లో మధుసూధన్ ను అర్రెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.