English | Telugu
ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం శాఖలు అన్నీ కత్తిరించేసారు
Updated : Jul 9, 2020
ఐతే ఇదంతా గతం ప్రస్తుతం ఆయన అధికారాలు, శాఖలు అన్నీ కత్తిరించేసారు. ఎం జరిగింది ఏమో కానీ ఒక సంవత్సరం తిరిగి వచ్చే సరికి ఆయనకు ఎటువంటి అధికారాలు, శాఖల బాధ్యతలు లేకుండా ఒట్టి సలహాదారుగా మాత్రమే మిగిల్చారు. దీంతో పేరుకు సలహాదారు అనే పదవి ఉంది కానీ ఏ విషయంలో సలహాలివ్వాలో పాపం ఆయనకి కూడా క్లారిటీ లేని పరిస్థితి. ఆయనతో పాటు సంవత్సరం క్రితం కేంద్ర సర్వీసులో ఉన్న డాక్టర్ పివి రమేష్ ను కూడా సీఎం ఓ ముఖ్య కార్యదర్శి గా నియమించుకుని ఆరోగ్యం, విద్య, వైద్య, ఐటి, పరిశ్రమలు వంటి కీలక శాఖలయూ అప్పగించారు. ప్రస్తుతం పీవీని కూడా అన్ని బాధ్యతల నుండి తప్పించి కేవలం ఒక సలహాదారుగా కొనసాగిస్తున్నారు
ఐతే ఏరి కోరి తెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం, పీవీ రమేష్ వంటి వారిని కూడా ఇలా సబ్జెక్ట్ లు లేకుండా చేయటం.. అది కూడా కనీసం ముందుగా పిలిచి ఆయనకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా చేశారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక అనుభవజ్ఞుడైన అధికారికి ఇది చాలా అవమానకరం అని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
ఐతే తాజా ఆదేశాల ప్రకారం.. గతంలో కేటాయించిన సబ్జెక్ట్ ల ఆదేశాలు అన్నింటిని రద్దు చేస్తూ కొత్తగా మళ్ళీ ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాదారణ పరిపాలన శాఖతోపాటు హోం, రెవెన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ (వ్యయం మినహా), న్యాయ, లెజిస్లేటివ్ వ్యవహారాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్, ఇతర అనుబంధ విభాగాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అన్ని అంశాలు ప్రవీణ్ ప్రకాష్ పరిధిలోనే ఉంటాయి.
ఇక సాల్మన్ ఆరోగ్యరాజ్ కు రవాణా, రోడ్లు భవనాల శాఖ, హౌసింగ్, ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, అన్ని సంక్షేమ శాఖలు, పరశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ,ఐటి, గనులు, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ లను కేటాయించారు.
ధనుంజయ్ రెడ్డికి జలవనరులు, ఎన్విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్, మున్సిపల్ అడ్మిస్టేషన్, వ్యవసాయం, అనుబంధ విభాగాలు, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ, ఎనర్జీ, టూరిజం, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ , ఫైనాన్స్ (వ్యయ విభాగం) కేటాయించారు.