English | Telugu
యూఎస్ ఎన్నికల్లో హోరాహోరీ! ప్రస్తుతానికి లీడ్ లో జో బైడెన్
Updated : Nov 4, 2020
డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలను, ఎలక్టోరల్ ఓట్లను పరిశీలిస్తే, అలబామా (9), అర్కాన్సాస్ (6), ఇండియానా (11), కెంటుకీ (8), లూసియానా (8), మిసిసిపీ (6), నార్త్ డకోటా (3), ఓక్లాహామా (7), సౌత్ కరోలినా (9), సౌత్ డకోటా (3), టెన్నిస్సీ (11), వెస్ట్ వర్జీనియా (5), వ్యోమింగ్ (3) ఉన్నాయి. ఇక బైడెన్ కొలరాడో (9), కనెక్టికట్ (7), డెలావర్ (3), డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా (3), ఇల్లినాయిస్ (20), మేరీల్యాండ్ (10), మసాచుసెట్స్ (11), న్యూజర్సీ (14), న్యూయార్క్ (29), రోడ్ ఐలాండ్ (4), వెర్మాంట్ (3), వర్జీనియా (13) లో విజయం సాధించారు.
ఇప్పటివరకు లెక్కించిన రాష్ట్రాల్లో వెనకబడి ఉన్న విజయంపై ధీమాగానే ఉన్నారు ప్రస్తుత ప్రెసెడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం తనకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ పెట్టిన ట్రంప్.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ముందంజలో ఉన్నాము. కృతజ్ఞతలు" అని అందులో పెర్కొన్నారు. అంతకుముందు, "ఓటేసేందుకు మరికొంత సమయం ఉంది. మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో చూసుకుని వెళ్లి, అమెరికాను గొప్పగా మార్చే డొనాల్డ్ ట్రంప్ కు ఓటేయండి" అని ట్రంప్ ట్వీట్ చేశారు.