English | Telugu

కరోనాతో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా రెండు దశాబ్దాల పాటు పనిచేసిన మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి లో చేరారు. అయితే పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన గత రెండుదశాబ్దాలుగా టీటీడీలో సేవలందించారు.

ఇటీవల టీటీడీలో పనిచేస్తున్న వారిలో దాదాపు 150 మందికి కరోనా సోకింది. వారిలో 18 మంది అర్చకులు కూడా ఉన్నారు. కరోనా బారిన పడిన శ్రీనివాసమూర్తి దీక్షితులు నాలుగు రోజుల కిందట చికిత్స కోసం సిమ్స్ లో చేరారు. ఆలయ సంప్రదాయ పద్ధతిలో శ్రీనివాస మూర్తి దీక్షితుల తుది అంతిమ సంస్కారాలు చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులకి ఆయన పార్థివదేహాన్ని అప్పగించే అవకాశం లేదు.