English | Telugu

అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యత ట్రావెన్ కోర్ వంశస్తులదే

తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్కోర్ రాజ వంశస్థులవే అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ లలిత్ జస్టిస్ మల్హోత్ర ధర్మాసనం తుది తీర్పును ఈరోజు వెలువరించింది.

అనంత పద్మనాభ స్వామి ఆలయ పాలన బాధ్యత పైన 2011 జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ట్రావెన్కోర్ వంశస్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తొమ్మిది సంవత్సరాల పాటు వాదోపవాదాలు విన్న తర్వాత ఈరోజు సుప్రీం కోర్టు తుది తీర్పు ఇచ్చింది. అయితే గత ఏడాది ఏప్రిల్లోనే విచారణ పూర్తి అయినప్పటికీ తీర్పును మాత్రం రిజర్వ్ చేశారు. సోమవారం తుది తీర్పు తరువాత ఈ ఆలయానికి సంబంధించిన సంపద నిర్వహణ బాధ్యత ట్రావెన్కోర్ వంశస్థుల కే దక్కుతుంది.

2011 లో జరిగిన తవ్వకాలలో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దాదాపు 10 లక్షల కోట్ల విలువైన సంపద బయటపడటం తో ఈ ఆలయం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తరతరాలుగా ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రావెన్కోర్ రాజవంశానికి ఆలయ నిర్వహణ బాధ్యతలు దక్కాయి.