English | Telugu
వలస కూలీల రైలు ఛార్జీలు కాంగ్రెస్సే భరిస్తుంది! సోనియా గాంధీ
Updated : May 4, 2020
అనేక మంది కూలీలు ఆహారం, నీరు, మందులు, డబ్బు లేకుండానే కాలినడన బయలుదేరారని గుర్తుచేశారు. కూలీల సమస్యల్ని పరిష్కరించడంలో భాజపా సర్కార్ ఘోరంగా విఫలమైందని సోనియా విమర్శించారు.
విదేశాల్లో నిలిచిపోయిన ప్రవాసుల్ని విమానాల ద్వారా భారత్‌కు తీసుకొచ్చినప్పుడు.. దేశ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కూలీల విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కేంద్రాన్ని సోనియా ప్రశ్నించారు. గుజరాత్‌లో ఓ కార్యక్రమానికి జనాన్ని సమీకరించేందుకు, వారికి భోజన వసతి కల్పించేందుకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పేద కూలీల కోసం ఈ మాత్రం చేయలేదా అని నిలదీశారు.
పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.151 కోట్ల నిధుల్ని విరాళంగా ఇచ్చిన రైల్వే శాఖ వలస కార్మికులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించలేదా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి వలస కార్మికులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ తలెత్తలేదని సోనియా అన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ స్పందించి పేద కూలీలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిందన్నారు.